తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో అంచెలంచెలుగా పైకి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి.. కేవలం వెండి తెరపై ఎంటర్ టైన్ మెంట్ కే పరిమితం కాకుండా.. 20 సంవత్సరాల నుంచి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సాయం చేశారు.. చేస్తూనే ఉన్నారు. ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంత్రి ప్రాణాలు పోయాయి. ఎంతో మంది సమయానికి ఆక్సీజన్ అందక ఇబ్బందులు పడ్డారు. వారికోసం చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులను ఇరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. అంతే కాదు సీసీసీ ద్వారా ఎంతో మంది పేద కళాకారులను ఆదుకున్నారు.
చిరంజీవి సేవలు మరింత విస్తరించడానికి, మరింతమందికి ఉపయోగపడటానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ని ఇవాళ లాంచ్ చేశారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ ఆఫీసులో రామ్ చరణ్ ఈ వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ… ఈ వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చిరంజీవి ట్రస్ట్ లో ఉన్న సేవల గురించి, బ్లడ్, ఐ బ్యాంకులో ఉన్న నిల్వల గురించి తెలుసుకొని సాయం పొందొచ్చు. అంతే కాదు డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని వచ్చి డొనేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి వెయిట్ చేయనవసరం లేదు. సైట్ లో మీరు ఏ టైంలో ఏ రోజు రావాలనుకుంటే అప్పుడు స్లాట్ బుక్ చేసుకొని వచ్చి డొనేట్ చేయవొచ్చని అన్నారు.
ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా ముందుకు రావాలని అన్నారు. అయితే ఎవరికైనా రక్త దానం, నేత్ర దానం కావాలన్నా ఇందులో రిక్వెస్ట్ పెడితే మేము త్వరగా రెస్పాండ్ అవుతాము. ప్రస్తుతం బ్లడ్, ఐ బ్యాంక్ మాత్రమే ఉంది. త్వరలో మిగిలిన అన్ని ఆర్గాన్స్ కి డొనేట్ చేసేలాగా అవయవ దానం కూడా మొదలు పెడతాము అని తెలిపారు. మేము చేసే సేవా కార్యక్రమాలకి ఎవరన్నా వాలంటీర్లుగా రావాలన్న ఈ వెబ్ సైట్ లో అప్లై చేయొచ్చు అని తెలిపారు. ఇదే వేదికపై చిరంజీవి పర్సనల్ వెబ్ సైట్ లాంచ్ చేయగా, ఇందులో చిరంజీవి ఇప్పటిదాకా నటించిన సినిమాల వివరాలు ఉంటాయి.