సోషల్ మీడియా ద్వారా సూపర్ ఫేమ్ దక్కించుకున్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి. టిక్ టాక్ వీడియోలతో మంచి పాపులారిటీ తెచ్చుకొని.. బిగ్ బాస్ తో యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అమ్మడి ఫోటోషూట్స్ చూస్తే యూత్ అంతా ఎగబడి చూస్తుంటారు.
అలాంటిది అషురెడ్డి తాజాగా పోస్ట్ చేసిన ఫోటో పై ఎప్పుడూ లేనివిధంగా కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అషు రెడ్డి పోస్ట్ చేసిన కొత్త ఫోటోకి క్యాప్షన్ గా ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అని ఓ పెద్దాయన చెప్పారు.. దీన్ని మీరు తెలుగులో చెప్పండి’ అంటూ ఇంగ్లీష్ లో రాసిపెట్టింది. అంతే అషు ఫాలోయింగ్ కి కామెంట్స్ ఒక్కసారిగా వెల్లువెత్తాయి.
తాజాగా అల్ట్రా మోడ్రన్ స్టైల్ లో టార్న్ డెనిమ్ షర్ట్ ధరించి ఫోటోషూట్ చేసిన అషూ పై.. ‘చిరిగిన చొnetizens slams,క్కా వేసుకున్నావ్ సరే.. మరి పుస్తకం కొన్నావా?’, ‘కొటేషన్ బాగానే ఉంది కానీ మరి మంచి పుస్తకం ఎక్కడ?’, ‘పాపం వీధి కుక్కలు దాడిచేసాయేమో చొక్కా మొత్తం చినిగింది’ అంటూ ఫన్నీ కామెంట్లతో దాడి చేశారు. ప్రస్తుతం అషు పేరు బిగ్ బాస్ ఓటిటిలో కూడా వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం అషు ‘ఫోకస్’ అనే సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. మరి అషు ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.