ఉత్తరాది చలన చిత్రపరిశ్రమలో కపూర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో ఫృథ్విరాజ్ కపూర్ ఫ్యామిలీ కి చెందిన హీరోల హవా కొనసాగేది. ఫృథ్విరాజ్ నుంచి ఇప్పటి మీరో రణ్ బీర్ కపూర్ వరకు ఎంతో మంది హీరోలు వెండి తెరపై తమ సత్తా చాటారు. కొంత మంది హీరోలు, దర్శక, నిర్మాతలు గా కొనసాగారు. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచార్య’ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘ఆచార్య’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్నారు చిరంజీవి. ఇందులో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంగ్లీష్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్ తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని.. తన జీవితంలో ఆచార్య ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రం అన్నారు. అలాగే తన మనసులో మాట కూడా చెప్పారు.. దక్షిణాది ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీగా తన కుటుంబం ఉండేలా తీర్చిదిద్దాలనుకున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లంతా తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారని చెప్పారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ఉన్న గౌరవం ఎంత గొప్పదో వారికి ఉన్న పేరు, ఫేమ్ ను చూసి తనకెంతో ముచ్చటేసిందని తెలిపారు. ఈ విషయాన్ని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కూడా చెప్పినట్లు ఆయన అన్నారు.
దక్షిణాదిలో నా కుటుంబ సభ్యులు కూడా హీరోలుగా ఎదిగి ఎవరి ప్రత్యేకత వారు చాటుకోవాలనే ఆకాంక్ష తనలో ఉండేదని అన్నారు. బ్యాగ్ గ్రౌండ్ పై ఆధారపడకుండా ఇప్పుటి వరకు మెగా హీరోలు తమ సొంత కష్టాన్ని నమ్ముకున్నారని.. పవన్ కళ్యాణ్ నుంచి అల్లు అర్జున్ వరకు తమ ప్రత్యేకత చాటుకుంటున్నారని సంతోషం వెల్లబుచ్చారు. ఈ విషయంలో నేనెంతో గర్విస్తున్నానని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.