జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతో పాటు మిగతా షోల్లోనూ స్కిట్లతో ఎంటర్ టైన్ చేస్తుంటారు. అందులో కాస్త ఫన్-రొమాంటిక్ గా ఉండేందుకు.. పలువురు జోడీలను క్రియేట్ చేస్తుంటారు. అలాంటి వారిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది సుధీర్-రష్మీ గురించి. జబర్దస్త్ షోతోనే మొదలైన వీరి బాండింగ్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీళ్ల మధ్య కెమిస్ట్రీ చూసి, పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అది జస్ట్ టీఆర్పీ కోసం సృష్టించారని తెలిసి అందరూ రిలాక్స్ అయ్యారు.
ఇకపోతే వీళ్ల తర్వాత చాలాజోడీలు ఫేమ్ తెచ్చుకున్నాయి. కాకపోతే సుధీర్-రష్మీలా అంత పాపులర్ కాలేకపోయారు. ఇమ్మాన్యూయేల్-వర్ష, నూకరాజు-ఆసియా లాంటి వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. వీళ్లతోపాటు రాకింగ్ రాకేశ్-సుజాత జోడీ కూడా ఉంది. వీరిది కూడా టీఆర్పీ కోసం క్రియేట్ చేసిన జోడీనే అనుకున్నారు. కానీ వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఎప్పుడు చేసుకుంటారనేది కూడా రాకేశ్ బయటపెట్టాడు.
వినాయక చవితి సందర్భంగా ‘మా ఊరి దేవుడు’ పేరుతో ఈవెంట్ చేశారు. ఇందులో రాకేశ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. రాకేశ్ తమ్ముడి కూతురికి పేరు కూడా పెట్టారు. ఈ క్రమంలో రాకేశ్ పెళ్లి గురించి టాపిక్ రాగా.. గెటప్ శ్రీను ఫ్యామిలీలోని అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నానని, పెళ్లి గురించి ఆయనే చెబుతారని అన్నాడు. దీంతో రాకేశ్ పెళ్లి.. జోర్దార్ సుజాతతో ఉంటుందని, ఫిబ్రవరిలో జరుగుతుందని శ్రీను చెప్పాడు. ఇన్ని రోజులు టీఆర్పీ కోసం అనుకున్నాం కానీ ఎట్టకేలకు ఓ జోడీ.. రియల్ గా పెళ్లి చేసుకోనుందనమాట అని నెటిజన్స్ అనుకుంటున్నారు. మరి రాకేశ్ పెళ్లి న్యూస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్ షబీనా.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్!