నటీనటులు పబ్లిక్ ఫిగర్స్. ఎప్పటికప్పుడు సినిమాలు, సోషల్ మీడియా రూపంలో వాళ్లు.. ప్రేక్షకులతో టచ్ లో ఉంటారు. చాలామంది ఫోకస్ వారిపై ఉంటుంది. ఈ క్రమంలోనే సదరు నటీనటులపై ట్రోల్స్, మీమ్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం కొందరు నెటిజన్స్ రెచ్చిపోతుంటారు. ఏకంగా సదరు నటీనటుల ఇన్ స్టా, ఫేస్ బుక్ అకౌంట్స్ ని హ్యాక్ చేసేస్తుంటారు. సదరు హీరో లేదా హీరోయిన్ చనిపోయిందని.. ఆయన యాక్టర్స్ ఖాతాల్లోనే పోస్టులు పెడుతుంటారు. కానీ అవతలి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారనేది మాత్రం.. హ్యాకర్లు పట్టించుకోరు. ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటి సంఘటనే ఓ హీరోయిన్ విషయంలో జరిగింది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలీక.. ఓ లాంగ్ వీడియోని పోస్ట్ చేసింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పంజాబీ ప్రముఖ నటి నికిత్ ధిల్లోన్ ఇన్ స్టా అకౌంట్ ఈ మధ్య హ్యాక్ అయింది. సదరు దుండగుడు.. నికిత్ చనిపోయిందని, ఆమె అకౌంట్ లోనే పోస్ట్ పెట్టాడు. ‘మా ప్రియమైన కుమార్తె నికిత్ ధిల్లాన్ అకాల మరణాన్ని ప్రకటించడం చాలా బాధగా ఉంది. మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’ అని అందులో హ్యాకర్ రాసుకొచ్చాడు. వెంటనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసి చాలా మనోవేదనకు గురైనట్లు నికిత్ చెప్పింది. ఆ టైంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చిందని కూడా పేర్కొంది. తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదన అనుభవించాలని నికిత్ చెప్పుకొచ్చింది. ఇది పబ్లిసిటీ స్టంట్ అని చాలామంది అనుకున్నారు కానీ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఎంత షాక్ అయ్యారో తనకు మాత్రమే తెలుసని ఆవేదన వ్యక్తం చేసింది.
‘మా అమ్మమ్మ భటిండాలో నివసిస్తుంది. ఎవరో ఫోన్ చేసి నేను చనిపోయానని ఆమెకు చెప్పారు. వెంటనే మా అమ్మని పిలిచి చాలా ఏడ్చింది. ఆమె మానసికంగానూ కుంగిపోయింది. మేమంతా జరిగిన విషయం ఆమెకు చెప్పాం కానీ ఓదార్చలేకపోయాం. హ్యాకింగ్, సోషల్ మీడియా గురించి ఆమెకు చెప్పినా సరే అర్థం కాలేదు. ఆమె వయసు వల్ల మేం దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంది. ఈ వార్త ఆమెని చాలా ఎఫెక్ట్ చేసింది. తర్వాత రోజు నేను ఆమెతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది.’ అని నికిన్.. తను ఫేస్ చేసి షాకింగ్ సిట్చూయేషన్ గురించి బయటపెట్టింది. ఇదిలా ఉండగా తొలుత మోడల్ గా చేసిన నికిత్.. తర్వాత నటిగా పంజాబీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మూడు సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు ఈమెకు ఇలా కావడంతో.. సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి నెటిజన్లకు తెలిసొచ్చింది.