బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య తనని లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది ఆరిజన్ పాల సంస్థ భాగస్వామి అయిన శేజల్. ఈ వార్త తెలంగాణ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన బోడపాటి శేజల్ ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ పెద్దమ్మ గుడి దగ్గర నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం అందుతోంది. పెద్దమ్మ టెంపుల్ వద్ద స్పృహ తప్పి పడిపోయిన శేజల్ స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిని అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.
ఇటీవల బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య తనను మానసికంగా, లైంగికంగా వేధించారని ఆరోపించింది శేజల్ అనే యువతి. ఆరిజన్ పాల సంస్థ భాగస్వామి అయిన శేజల్ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆరు నెలలుగా తాను ఎంత పోరాటం చేస్తున్నా తనకు న్యాయం జరగడం లేదని.. ఆవేదన చెంది ఈ మద్యనే ఆమె ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విషం తాగారు. వెంటనే ఆమెను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న శేజల్ తాజాగా హైదరాబాద్ పెద్దమ్మ గుడి దగ్గర నిత్రమాత్రలు మింగి మరోసారి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
స్పృహ తప్పి పడిపోయిన శేజల్ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. శేజల్ బ్యాగ్ లో నిత్రమాత్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఆదినారాయణ అనే వ్యక్తి శేజల్ ను పెద్దమ్మ గుడి దగ్గర డ్రాప్ చేశారని తెలుస్తోంది. కాగా, శేజల్ బ్యాగులో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.