ఈ మద్య కాలంలో చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల వరకు గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. అప్పటి వరకు అందరితో ఆనందంగా ఉన్నవారు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
దేశ వ్యాప్తంగా ఈ మద్యకాలంలో వరుసగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలా మంది హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉంటూ.. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కార్డియాక్ అరెస్టు తో కుప్పకూలిపోతున్నారు. వ్యాయామం, డ్యాన్స్ చేస్తూ, క్రీడలు ఆడుతున్న వారు ఒక్కసారే కుప్పకూలిపోయి ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూస్తున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ అగ్రనేత కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. తాజాగా మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శను గుండెపోటుతో కన్నుమూశారు. గత నెల 31 ఆయనకు ఛాతిలో తీవ్రంగా నొప్పిరావడం దానికి తోడు డయాబెటీస్ ఉండటంతో తీవ్ర అనారోగ్యంతో చనిపోయినట్టు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి ఆగస్ట్ 3 వరకు కటకం సుదర్శన్ స్మృతిలో సంతాప సభలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మొదటి నుంచి అభ్యుదయభావాలు ఉన్న సుదర్శన్ ప్రజల కోసం పోరాటం చేస్తూ వచ్చారని.. ఆయన త్యాగాలు మరువరానివని అభయ్ అన్నారు.
తెలంగాణ లోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఓ సామాన్య కార్మిక కుటుంబంలో జన్మించిన కటకం సుదర్శన్ బెల్లంపల్లిలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత వరంగల్ లోని పాలిటెక్నిక్ చదివి… మాబోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. ఆ సమయంలో శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974 లో ఆయన మైనింగ్ డిప్లమా చేస్తూ రాడికల్ విద్యార్థి సంఘం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. బెల్లంపల్లి పార్టీ సభ్యుడిగా సింగరేణి కార్మిక ఉద్యమం, రాడికల్ విద్యార్థి ఉద్యమాల్లో సుదర్శన్ ఎంతో చురుకైన పాత్ర పోషించారు.
ఆ తర్వాత 1978 లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ ఆర్గనైజర్ గా రైతాంగ ఉద్యమంలో పాల్గొని రైతులకు అండగా నిలిచారు. మావోయిస్టుగా పలు కీలక బాధ్యతలు నిర్వహించిన సుదర్శన్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గెరిల్లా పోరాటంలో ఆయన ఆరితేరినవారని.. పోలీసుల నుంచి ఎన్నోసార్లు తప్పించుకున్నారని అంటుంటారు. ఆయనను కటకం సుదర్శన్, మోహన్, వీరేందర్ జీ, ఆనంద్ అని పిలుస్తుంటారు.