బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ. తాజాగా భారత్ లో మరో భారీ స్కామ్ బయటపడింది. ఇప్పటి వరకు ఏబీజీ షిప్ యార్డు 20 వేల కోట్ల రూపాయలు, నీరవ్ మోడీ చేసిన 13 వేల కోట్ల రూపాయల స్కామ్ లే అతి పెద్ద బ్యాంకు మోసాలుగా ఉన్నాయి. తాజా స్కామ్ తో అవి కూడా వెనక్కిపోయాయి. ఈసారి 17 బ్యాంకుల్లో ఏకంగా రూ.34,615 కోట్ల వరకు కుచ్చు టోపీ పెట్టారు. వివరాల్లోకి వెళితే..
వివిధ బ్యాంకుల నుంచి సుమారు ముప్పైనాలుగు వేల కోట్లకు పైగా మోసం చేశారని దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అయితే దేశంలో ఇదే అతి పెద్ద స్కామ్ అని సీబీఐ అధికారులు అంటున్నారు.
ఇందుకు సంబంధించిన ఈ నెల 20న కేసు రిజిస్ట్రర్ చేశామని.. ముంబైలో అమరెల్లీస్ రియాల్టర్స్ అధిపతి సుధాకర్ శెట్టి, మరో 8 మంది బిల్డర్ల కు సంబంధింని ఆస్తులపై సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కాగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్ రిజిష్టర్ చేసినట్టు వారు తెలిపారు.