ఈ బ్యాంకులు వ్యవసాయం చేసే రైతులకి ఒక లక్ష లోన్ ఇవ్వడానికి ముందుకు రావు గానీ.. సూటు, బూటు ఏసుకుని సొల్లు కబుర్లు చెప్పే మోసగాళ్లకు మాత్రం వేల కోట్లు లోన్లు ఇవ్వడానికి మాత్రం ఎగబడి ముందుకొస్తాయి. తీరా లోన్ ఇచ్చాక వాళ్ళు ఎగ్గొడతారు. వాళ్ళు దొరికితే ఓకే, వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కూడా లేకుండా చేస్తే.. ఆ నష్టాన్ని ప్రజల మీద రుద్దుతాయి ఈ బ్యాంకులు. ఇది ప్రస్తుత ప్రాసెస్ ఆఫ్ బ్యాంక్స్. ఎవరో చేసిన మోసానికి.. జనాలు బలైపోతారు. ఇది ఎప్పుడూ ఉండేదే కదా. తాజాగా ఓ ప్రముఖ కంపెనీ పేరు చెప్పుకుని కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కుమ్మక్కై.. బ్యాంకుకి 4 వేల కోట్లు టోకరా వేశారు.
ఏ పనీ జరగకపోయినా.. నకిలీ ప్రాజెక్ట్ రిపోర్టులు చూపించి.. బ్రహ్మాండంగా వ్యాపారం జరిగిపోతుందని నమ్మించి.. బ్యాంక్ నుంచి వేల కోట్లు లొంలౌ తీసుకుని జల్సాలు చేశారు. ఎట్టకేలకు బ్యాంకు కళ్ళు తెరిచి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కోల్కతా ఆధారిత ప్రైవేట్ కంపెనీ కార్పొరేట్ పవర్ లిమిటెడ్ మరియు కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లు, ఇతర ప్రైవేటు వ్యక్తుల మీద బ్యాంక్ ఫ్రాడ్ కేసు నమోదయ్యింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. 20 బ్యాంకుల కన్సార్టియంకు సంబంధించి 4037.87 కోట్ల మేర ఫ్రాడ్ చేసినట్లు యూనియన్ బ్యాంక్ ఫిర్యాదులో తెలిపింది.
దీంతో సీబీఐ నాగ్ పూర్, ముంబై, రాంచి, కోల్కతా, దుర్గాపూర్, ఘజియాబాద్, విశాఖపట్నం సహా మొత్తం 16 లొకేషన్స్ లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలకమైన పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. సెప్టెంబర్ 30 2013న యూనియన్ బ్యాంక్.. కంపెనీ యొక్క ఖాతాను నిరర్థక ఆస్తిగా ప్రకటించింది. 2009 నుంచి 2013 మధ్య కాలంలో రుణగ్రహీత.. భూటకపు ప్రాజెక్ట్ కాస్ట్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేసి బ్యాంకుని మానిప్యులేట్ చేశారని, బ్యాంక్ నిధులను దారి మళ్లించారని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. వాణిజ్య రాబడులు, సంబంధిత పార్టీలతో లావాదేవీలు, వివిధ కంపెనీల నకిలీ ఖాతాలకు నిధులు మళ్లించినట్లుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.
ఈ కేసులో కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లుగా ఉన్న మనోజ్ జైస్వాల్, అభిషేక్ జైస్వాల్, అభిజిత్ జైస్వాల్, రాజీవ్ కుమార్, బిషాల్ జైస్వాల్, మున్నా కుమార్ జైస్వాల్, పిఎన్ కృష్ణన్, రాజీవ్ గోయల్, అరుణ్ కుమార్ శ్రీవాస్తవ, ఎస్ఎన్ గైక్వాడ్, ప్రేమ్ ప్రకాష్ శర్మ, అరుణ్ గుప్త నిందితులుగా ఉన్నారు. ఐరన్, స్టీల్ తయారీలో ఈ కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఇన్వాల్వ్ అయి ఉంది. దీని రిజిస్టర్డ్ అడ్రస్ సాల్ట్ లేక్ కాగా ప్రస్తుతం కంపెనీ మూతపడ్డానికి రెడీగా ఉంది.
చూశారా.. తినడానికి వరి పండిస్తాను.. లోన్ ఇవ్వండి అని నిజాయితీగా అడిగే రైతుకి లోన్లు ఇవ్వరు. ఉద్యోగం లేదు, ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాను.. లోన్ ఇవ్వండి అని ఒక నిరుద్యోగి అడిగితే వంద ఆరాలు తీస్తారు. కానీ ఏమీ లేకపోయినా ఇలాంటి నకిలీ గాళ్ళకి మాత్రం వేలకు వేలు కోట్లు లోన్లు ఇస్తారు. అదే డబ్బు చదువుకున్న నిరుద్యోగులకు ఇస్తే.. సంపదను సృష్టిస్తారు. అవునా? కాదా? అంత డబ్బు మీ దగ్గర ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి సంపదను సృష్టించలేరా? మరి నిజాయితీ ఉన్న వాళ్ళని నమ్మకుండా.. అవినీతికి పాల్పడే వాళ్ళని నమ్మే బ్యాంకులను ఏమనాలి? ఇలా బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టే బడాబాబులని ఏం చేయాలి?
The CBI has filed an FIR against Corporate Power Limited and its directors in an alleged Rs 4,000-crore bank fraud.
More info⬇️https://t.co/7wlhU1z9QF#Banks #Fraud #CBI #Bank
— Moneycontrol (@moneycontrolcom) December 23, 2022