ఇటీవల ఏపీలో పలువురు సీనియర్ నేతలు కన్ను మూయడంతో ఆ పార్టీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితీ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ వచ్చారు. చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. యువకుడిగా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-94లో నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
కాంగ్రెస్ పార్టీ వీడి ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు సోదరుడు అవుతారు. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి మాయయ్య అవుతారు. ఆయన మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. పలువురు రాజకీయ నేతలు ఆయనకు సంతాపం ప్రకటించారు.
టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/150ABmt8uM
— Lokesh Nara (@naralokesh) April 29, 2022
ఇది చదవండి: Young Director: కరెంట్ షాక్‌తో యంగ్ డైరెక్టర్ మృతి!