నెల్లూరు జిల్లాలో సముద్ర తీరానికి అనుమానాస్పదంగా ఉన్న ఓ పడవ కొట్టుకువచ్చింది. అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్ర తీరంలో ఈ అనుమానాస్పద పడవ దర్శనమిచ్చింది. ఇది గమనించిన మత్స్యకారులు దగ్గరకు వెళ్లి పడవను పరిశీలించారు. దాని లోపల బుద్ధుడి విగ్రహం, శివలింగం కనిపించాయి. వీటిని గమనించిన మత్స్యకారులు ఇదేదో స్మగ్లింగ్, దొంగ సరుకు రవాణాకు చెందిన పడవ అని భావించి.. దీని గురించి మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి.. […]
వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని సముద్రంలో మునిగిపోయిన నౌకల ఆనవాళ్లను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లను కనుగొని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఓ నౌక ఆనవాళ్లను గుర్తించిన లివిన్ అడ్వెంచర్స్ బృందానికి ఈ బాధ్యత అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాకు సమీపంలో మూడుచోట్ల వివిధ సందర్భాల్లో నౌకలు మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన బ్రిటిష్ ఇండియా […]
మహారాష్ట్రపై తౌక్టే తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద సేవలు అందిస్తున్న పి 305 అనే భారీ నౌక తుపాన్ ధాటికి సముద్రంలోనే మునిగిపోయింది. తౌక్టే తుపాన్ తీరం దాటుతున్న సమయంలో కొట్టుకుపోయిన రెండు నౌకల్లో ఒక నౌక ముంబయి తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఈ నౌక సముద్రంలోకి కొట్టుకుపోయిన సమయంలో నౌకలో 261 మంది ఒఎన్‌జిసి ఉద్యోగులు ఉన్నారు. […]
ముంబయి- ఓ వైపు కరోనా, మరో వైపు తుఫాను భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా ఇప్పటికే భీబత్సం సృష్టిస్తోంటే.. అది చాలదన్నట్లు తౌక్టే సైక్లోన్ ధూసుకొచ్చింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫానుకు మహారాష్ట్ర, గుజరాత్ సహా ఐదు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. ఈ తుఫాను ప్రస్తుతం గుజరాత్ తీరం వైపు పయనిస్తోంది. మంగళవారం సాయంత్రం ఇది గుజరాత్ పోరుబందర్ మహూవా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. […]