నేటికాలంలో చాలామందికి నడి వయస్సు రాగానే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. దీంతో పనులను చాలా నెమ్మదిగా చేస్తుంటారు. మరికొందరు అసలు పనులు చేయడానికి కూడా ఆరోగ్యం సహకరించదు. ఇక వృద్దుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పక్కవారి సాయం లేనిది వారు అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. కానీ 91 ఏళ్ల ఓ పెద్దమనిషి మాత్రం రైల్వే కూలీగా కష్టపడి పనిచేస్తున్నారు. తొమ్మిది పదుల వయస్సులోనూ కుర్రాడిలా పనిచేస్తున్న ఈ వృద్ధుడు ఎందరికో ఆదర్శం. మరి.. ఆయన కథ […]
డబ్బు విలువ కష్టపడి సంపాదించే వారికే తెలుస్తుంది. అందుకే ప్రతి రూపాయను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరైనా అన్యాయంగా తమ డబ్బును తీసుకుంటే కొందరు ఏమి చేయలేక వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం వాటి కోసం పోరాడుతారు. అది రూపాయి అయినా కావోచ్చు. అలా తనకు రావాల్సిన ఒక రూపాయి అయినా సరే పొందాలి అనే కసి ఉన్న వ్యక్తి రూ.35 రీఫండ్ కోసం ఏకంగా ఐదేళ్లు పోరాటం చేశాడు. ఈ క్రమంలో […]
దశాబ్దాల చరిత్ర కలిగిన విజయవాడ రైల్వే స్టేషన్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతుందా ? రైల్వేబోర్డు చేస్తున్న ప్రయత్నాలు విజయవాడ జంక్షన్ ఉసురుతీయబోతున్నాయా ? దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్దిక వ్యవస్దను, తద్వారా స్దిరాస్ది రంగాన్ని పరుగులు తీయించాలన్న కేంద్రం ఆలోచనే ఇందుకు కారణమా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అదే జరిగితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రైల్వేస్టేషన్ ఎలా ఉండబోతోందో ఊహకు కూడా అందడం లేదు. 133 ఏళ్ల చరిత్ర గల విజయవాడ […]
ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్‌లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. నిన్న కూడా ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది. దూరాల నుంచి రావాల్సిన ట్యాంకర్లు ఆలస్యమయితే ఆస్పత్రుల్లో టెన్షన్ మొదలయిపోతోంది. కొందరి నిర్లక్ష్యం విలువైన ప్రాణవాయువును సైతం పీల్చిపిప్పి చేస్తోంది. చూస్తుండగానే లీటర్ల లీటర్ల ఆక్సిజన్ గాలో […]