ప్రభుత్వ బడుల్లో సదుపాయలు, వసతుల లేమి కారణంగా .. ప్రైవేటు బడులు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. బడులు పెట్టడం ఆలస్యం.. ప్రకటనలు చేసుకుని.. డొనేషన్లు, అడ్మిషన్ ఫీజు అని, ఆ ఫీజు.. ఈ ఫీజు అని చెబుతూ వేలల్లో గుంజేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఏడాదంతా స్కూల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఓ విద్యార్థి స్కూల్ ఫీజు కట్టలేదని ప్రిన్సిపాల్ ఏం చేశారంటే..?
పిల్లలను ఉన్నత స్థాయిలో ఉండాలని మధ్యతరగతి, దిగువ తరగతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లల భవిష్యత్ చదువుపైనే ఆధారపడి ఉందని చాలామంది తల్లిదండ్రులు బలంగా నమ్ముతారు. పిల్లల భవిష్యత్ కోసం కార్పొరేట్ స్కూల్ లో చేరుస్తుంటారు. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బును వారు తృణప్రాయంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ధారపోస్తున్నారు. అయితే ప్రైవేటు స్కూళ్లలలో ఫీజులకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది. నర్సరీ, ఎల్ కేజీ చదువులకే లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. కొన్ని కార్పొరేట్ […]
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. బుధవారం పంజాబ్ పాఠశాలల్లో అడ్మిషన్ లేదా ట్యూషన్ ఫీజులను పెంచకూడదని ఆదేశించారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం.. రాష్ట్రంలోని వందల వేలమంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించనుంది. స్కూల్ ఫీజులు ఎక్కువగా ఉండటం కారణంగా పిల్లలను ఒక చోట నుండి మరో చోటుకు మార్చవలసి వస్తుంది. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రి, యూనిఫాంలను ఫలానా దుకాణం నుంచి కొనుగోలు చేయాలని ఏ […]
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీపి కబురు చెప్పారు. ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజుల భారంతో ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజుల నియంత్రకు కొత్త చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల అంశంపై సుదీర్గంగా చర్చించారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం […]