ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు ప్రత్యక్ష వారధి వారే. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం, అర్హులైన వారికి పథకాలు అందేలా చూడటం వీరి ముఖ్య విధి. పైగా పిఛన్లు వంటి వాటిని ఇంటికే తీసుకెళ్లి లబ్ధిదారులకు అందజేస్తూ ఉంటారు. వీరికి గౌరవ వేతనం ఇస్తున్న విషయం తెలిసిందే. వీరి జీతాల పెంపు విషయంలో మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఉన్న వాలంటీర్లకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డికి చెందినదిగా భావిస్తున్న ఓ ఆడియో కలకలం రేపుతోంది. అమలాపురం మండలం ఈదరపల్లి వైకాపా MPTC అడపా సత్తిబాబును బెదిరించాడు. తమ ఇంటిని తగులబెడతారా అంటూ మంత్రి కుమారుడు అతణ్నీ తీవ్రస్థాయిలో దూషించాడు. అసభ్య పదజాలాన్ని కూడా వాడారు. రెండు కాళ్లు విరిచేస్తానని, అంతు చూస్తానంటూ ఎంపీటీసీని బండబూతులు తిడుతూ… బెదిరింపులకు దిగారు. ఇదంతా ఫోన్‌లోనే సాగింది. ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో బయటపడి వైరల్ […]
ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గం కూర్పు పూర్తయ్యింది. పాత, కొత్తల కలయికలతో 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తమ అభిమాన నేతలకు మంత్రి పదవి దక్కినందుకు కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పినిపే విశ్వరూప్‌కు ఆయన అభిమానులు వినూత్న రీతిలో వెల్కమ్ చెప్పారు. రోడ్డు మీద కరెన్సీ నోట్లు వెదజల్లుతూ స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. […]