ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గం కూర్పు పూర్తయ్యింది. పాత, కొత్తల కలయికలతో 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తమ అభిమాన నేతలకు మంత్రి పదవి దక్కినందుకు కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పినిపే విశ్వరూప్‌కు ఆయన అభిమానులు వినూత్న రీతిలో వెల్కమ్ చెప్పారు. రోడ్డు మీద కరెన్సీ నోట్లు వెదజల్లుతూ స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: భద్రాద్రి: మాజీ MLA ఇంట విషాదం.. ‘నిన్ను డాక్టర్‌ని చేసింది ఇందుకేనా తల్లి’!
రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తుండటంతో.. విశ్వరూప్ అనుచరులు.. బైక్‌లతో విన్యాసాలు చేసి హడావుడి చేశారు.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా అమలాపురం వచ్చిన విశ్వరూప్‌కు స్వాగతం తెలుపుతూ కరెన్సీ నోట్లు చల్లి.. తన అభిమానాన్ని చాటుకున్నారు నగర మార్కెట్ కమిటీ చైర్మన్. అంతేకాక హుషారుగా చిందులు వేశారు. అమలాపురం ఈదరపల్లి వంతెన వద్ద ఇలా కరెన్సీ నోట్లు చల్లుతూ స్వాగతం పలికిన మార్కెట్ కమిటీ చైర్మన్‌ని చూసి జనం నోరెళ్ళబెట్టారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై దాడి!మంగళవారం రాత్రి మంత్రి విశ్వరూప్ స్వగ్రామం అమలాపురం వస్తున్న నేపథ్యంలో ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజనులు భిన్న రీతిలో స్పందిస్తున్నారు. డబ్బులను అలా విచ్చలవిడిగా వృథా చేసే బదులు.. మంత్రి పేరు మీద కష్టాల్లో ఉన్న వారికి విరాళంగా ఇస్తే బాగుండేది కదా అని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి