ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డికి చెందినదిగా భావిస్తున్న ఓ ఆడియో కలకలం రేపుతోంది. అమలాపురం మండలం ఈదరపల్లి వైకాపా MPTC అడపా సత్తిబాబును బెదిరించాడు. తమ ఇంటిని తగులబెడతారా అంటూ మంత్రి కుమారుడు అతణ్నీ తీవ్రస్థాయిలో దూషించాడు. అసభ్య పదజాలాన్ని కూడా వాడారు. రెండు కాళ్లు విరిచేస్తానని, అంతు చూస్తానంటూ ఎంపీటీసీని బండబూతులు తిడుతూ… బెదిరింపులకు దిగారు. ఇదంతా ఫోన్‌లోనే సాగింది. ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో బయటపడి వైరల్ గా మారింది.
ఇటీవలే కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో మంత్రి విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే సతీశ్ ఇళ్లను నిరసనకారులు తగులబెట్టారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబు కూడా ఉన్నారు. అల్లర్లలో సత్తిబాబు ఉన్నారన్న విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి ఆయనకు ఫోన్ చేసి అంతు చూస్తానంటూ బెదిరించినట్లు ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టెన్త్ ర్యాంకులు ప్రకటిస్తే జైలుకే.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం!