హిందువులు ఎంతో ఆరాధ్యంగా పూజించే దైవస్వరూపాలలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక చరిత్ర ఉంది. సాధారణంగా ఆంజనేయ స్వామి అనగానే మనకు సింధూరమే గుర్తొస్తుంది. అందరు దేవుళ్లకు పసుపు, కుంకుమలు పెట్టి.. ఆంజనేయ స్వామికి సింధూరం పెడుతుంటారు. అలా ఎందుకు పెడతారో తెలుసుకోవాలంటే ఓసారి రామాయణం వైపు చూడాల్సిందే. అసలు ఆంజనేయ స్వామికి సింధూరం ఎందుకంత ఇష్టం? దానికి వెనుక గల కారణాలేమిటి? ఇప్పుడు చూద్దాం. రామ – రావణ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరాముడు ఆంజనేయుని భుజాలపై […]
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. వినాయక చవిత ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతోంది. పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. ప్రతి పండగ వెనకా ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది. ప్రకృతిలో మమేకమవుతూ […]
శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు. అలాంటి రూపాలలో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వేంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం. కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో, శ్రవణానక్షత్రం రోజులలో శ్రీవేకంటేశ్వరుడుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి. […]