గత వారం రోజులుగా ఏపిలో వర్సిటీకి NTR పేరు మార్చడంపై పెద్ద ఎత్తున రగడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా లక్ష్మీపార్వతి యన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు విషయంపై స్పందించారు. యన్టీఆర్ పేరు మార్చే విషయంపై ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో అందరికీ స్పష్టంగా తెలియజేశారు. ఆయన యన్టీఆర్ ని ఎంతో గౌరవిస్తారు.. అభిమానిస్తారు. ఇక ఈ విషయంలో తన వైఖరి ఒక్కటే.. యన్టీఆర్ పేరు యూనివర్సిటీకి ఉండాలా? జిల్లాకు ఉండాలా? అంటే ఖచ్చితంగా జిల్లాకే ఆయన పేరు […]
ఇటీవల అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం దేశవ్యాప్తంగా పలు చర్చలకు దారి తీసింది. కొందరైతే రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్‌ను బీజేపీ వాడుకోవాలని చూస్తోందంటూ వ్యాఖ్యలు వచ్చాయి. తెదేపాకు చెందిన నేతలు మాత్రం అది కేవలం సినిమాకి సంబంధించిన భేటీగా మాత్రమే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ విషయంపై తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షులు లక్ష్మీ పార్వతీ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ భేటీపై స్పందించడమే కాకుండా. తారక్‌కు లక్ష్మీ పార్వతీ ఓ […]
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో అనారోగ్య కారణాలతో మరణించిందనే వార్తలొచ్చినా.. పోలీసుల ఎంట్రీతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఇక ఎన్టీఆర్ కూతురు మరణిందనే వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, నందమూరి అభిమానులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఆమె మరణవార్త తెలియకగానే ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, […]
హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించేందుకు అర్హతలేదని, అందుకు తగిన ఆధారాలు కూడా లేవని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు నుంచి చంద్రబాబుకు ఊరట లభించింది. 2004 ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు చూపిన […]