ఇటీవల అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం దేశవ్యాప్తంగా పలు చర్చలకు దారి తీసింది. కొందరైతే రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్‌ను బీజేపీ వాడుకోవాలని చూస్తోందంటూ వ్యాఖ్యలు వచ్చాయి. తెదేపాకు చెందిన నేతలు మాత్రం అది కేవలం సినిమాకి సంబంధించిన భేటీగా మాత్రమే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ విషయంపై తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షులు లక్ష్మీ పార్వతీ స్పందించారు.
జూనియర్ ఎన్టీఆర్ భేటీపై స్పందించడమే కాకుండా. తారక్‌కు లక్ష్మీ పార్వతీ ఓ రిక్వెస్ట్ కూడా పెట్టారు. తనకు ఆ ఒక్క కోరిక ఉందని.. దానిని ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ తీర్చాలంటూ తెలిపారు. “జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి. తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడితి పార్టీని లాక్కున్నారు” అంటూ ఆరోపించారు. తిరుపతిలో జరిగిన స్వర్గీయ గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు జయంతి వేడుకల్లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
“గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేశారు. దాదాపు 30 వేల పాఠశాలలు మూతబడ్డాయి. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది సీఎం జగన్. పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశం దక్కేలా చేసింది జగన్. తెలుగు భాషాభివృద్ధి కృషి చేస్తున్నామంటున్న వారు.. వాళ్ల పిల్లలకు ఇంగ్లీష్ నేర్పడం లేదా? తెలుగు భాషకు సీఎం జగన్ ద్రోహం చేశారనే వ్యాఖ్యలు అవాస్తవం” అంటూ లక్ష్మీ పార్వతీ వ్యాఖ్యానించారు. తారక్‌కు లక్ష్మీ పార్వతీ చేసిన రిక్వెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.