మొన్నటి వరకు చికెన్ ధరలు పెరిగి.. మాంసాహార ప్రియులకు నిద్రలేకుండా చేశాయి. కేజీ చికెన్ రూ. 350 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. టమాటా, ఉల్లి, కందిపప్పు వంటి కూరగాయలు, నిత్యావసర ధరలు..
ఈ కాలంలోనూ వరకట్న వేధింపులు ఉన్నాయంటే నమ్ముతారా? ఆ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది అంటే నమ్మగలరా? రోజులు మారుతున్నా కొందరు మాత్రం ఇంకా మూర్ఖులుగా, మొండిగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. కోరిన కట్నం తీసుకురాకపోతే ఇంటికొచ్చిన ఆడపిల్ల ఉసురు పోసుకుంటూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన ఇప్పటికీ వరకట్నం కోసం పీక్కు తినే రాబంధులు ఉన్నాయని నిరూపించింది. అత్తింటి వేధింపులు, అత్తమామలు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ యువతి పురుగుల మందు తాగి […]
ఈ మధ్యకాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లో కన్నా ప్రేమ పెళ్లిల్లోనే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. ప్రేమించి వివాహాలు చేసుకుని కలకాలం సంతోషంగా ఉంటారనుకుంటే పెళ్లైన ఏడాదికే భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. వీటి కారణంగా కొందరు హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్యలకు చేసుకోవడం చేస్తున్నారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వివాహితకు చివరికి నిరాశే మిగిలింది. ఇష్టపడి చేసుకున్న భర్తతో విభేదాలు వచ్చాయి. ఇవి రాను రాను విడాకుల వరకు వెళ్లాయి. దీంతో మోసపోయానని గ్రహించిన […]
నిర్మల్- గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడిక్కడ వరద చేరడంతో ఉర్లకు ఊర్లు జలమయం అయ్యాయి. తెలంగాణలోని చాలా వరకు జిల్లాలన్నీ నీట మూనిగాయి. కొన్ని ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు జలదిగ్భంధంలో ఉన్నాయి. దీంతో ఎక్కడిక్కడ ప్రజా జీవనం స్తంబించిపోయింది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. […]