సైన్యంలో పనిచేయాలన్నది మీ కోరికా! అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఇండియన్ నేవీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం సాధిస్తే దేశం కోసం సేవ చేసినట్లు ఉంటుంది మరియు వేలకు వేలు జీతం పొందవచ్చు.
నిరుద్యోగులకు ఇండియన్ నేవీ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 242 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా, అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ వంటి పైచదువులు చదివిన వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి.
ఇంటర్ తరువాత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అపారం. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాఉంటాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటే.. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి కోర్సులు లేదా సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి పైచదువులు పూర్తిచేయవచ్చు. లేదు విద్యతో పాటు ఉపాధి కావాలనుకుంటే రక్షణ రంగాల వైపు అడుగులు వేయటం ఉత్తమం. ఇండియన్ నేవీ – 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష […]