సైన్యంలో పనిచేయాలన్నది మీ కోరికా! అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఇండియన్ నేవీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం సాధిస్తే దేశం కోసం సేవ చేసినట్లు ఉంటుంది మరియు వేలకు వేలు జీతం పొందవచ్చు.
భారత రక్షణ వ్యవస్థకు చెందిన భారత నావికా దళం(ఇండియన్ నేవీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్‌తో సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల అర్హత ప్రమాణాలు, పే స్కేల్, దరఖాస్తు విధానం.. వంటి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 372
విభాగాల వారీగా ఖాళీలు:
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుంచి ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అర్హులు.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబిసిలకు మూడేళ్లు, ఎస్‌సీ/ ఎస్‌టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంది.
జీతభత్యాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లిస్తారు.
ఎంపిక విధానం: దరఖాస్తుల స్క్రీనింగ్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.278+ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15.05.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 29.05.2023