నిరుద్యోగులకు ఇండియన్ నేవీ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 242 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా, అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ వంటి పైచదువులు చదివిన వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి.
భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభం కానున్న షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 242 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి వారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలి..? ఎంపిక విధానం..? జీతభత్యాలు ఎలా ఉంటాయి..? వంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
విభాగాల వారీగా ఖాళీలు:
ఎక్స్‌క్యూటివ్ బ్రాంచ్: 150
ఎడ్యుకేషన్ బ్రాంచ్: 12
టెక్నికల్ బ్రాంచ్: 80
విద్యార్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: పోస్టులను బట్టి జనవరి 2, 1997 నుంచి జనవరి 1, 2005 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక ప్రక్రియ: మూడు దశల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొదటి రౌండ్‌లో డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం రెండో రౌండ్‌లో ఇంటర్వ్యూ, మూడో రౌండ్‌లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
జీతభత్యాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100ల వరకు జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు లభిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులు ప్రారంభ తేది: 29.04.2023.
దరఖాస్తులకు చివరి తేది: 14.05.2023.