ఏప్రిల్ నెలలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. చాలా వరకు రోడ్లు నిర్మానుశ్యంగా కనిపిస్తున్నాయి. గత నెల వర్షాలు పడి కాస్త చల్లబడింది అనుకునే లోపు భారనుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇదిలా ఉంటే.. ఈ మద్య వాతావరణంలో హఠాత్తుగా మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందని, కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ అంచనాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) కొట్టి పడేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఈఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.
విశాఖపట్నం- ఆంద్రప్రదేశ్ కు విశాఖపట్నం వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మహారాష్ట్ర మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపురాయలసీమ, కోస్తా ప్రాంతంలో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. […]