ఏప్రిల్ నెలలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. చాలా వరకు రోడ్లు నిర్మానుశ్యంగా కనిపిస్తున్నాయి. గత నెల వర్షాలు పడి కాస్త చల్లబడింది అనుకునే లోపు భారనుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇదిలా ఉంటే.. ఈ మద్య వాతావరణంలో హఠాత్తుగా మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ మద్య వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి నెలకొంది. గత నెల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోతుంది.. భారీ వర్షాలు పడ్డాయి. మళ్లీ ఎండలు దంచికొట్టాయి. నిన్నటి వరకు తెలంగాణ లో భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. హైదరాబాద్ లో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.
నిన్నటి వరకు భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక ఎక్కడ నీడ దొరికితే అక్కడికి వెళ్లారు. గురువారం హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది.. సాయంత్రం కారుమబ్బులు కమ్మేశాయి. బోయిన్ పల్లి, సికింద్రబాద్, ఈసీఐల్, సుచిత్ర, నేరేడ్ మెట్, దిల్ షుక్ నగర్, హయత్ నగర్, ఎల్బీ నగర్, నారాయణ గూడ, మల్లేపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ప్రస్తుతం ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా నిప్పులు చెరిగే ఎండకు ప్రజలు విలవిల్లాడిపోయారు. వేసవిలో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే గురువారం సాయంత్రం హఠాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చింది. భారీగా కురుస్తున్న వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.