ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందని, కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ అంచనాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) కొట్టి పడేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఈఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.
ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని, కరువు ఏర్పడేందుకు అవకాశం ఉందంటూ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనాలకు విరుద్ధంగా ఐఎండీ ప్రకటన చేసింది. ఈఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. అయితే వర్షాకాలం మధ్యలో ఎల్ నినో పరిస్థితులు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయని, దాని వల్ల రుతుపవనాలపై ప్రభావం పడుతుందని, సీజన్ రెండో భాగంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
ఈ ఏడాదిలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 96 శాతం వర్షపాతం ఉంటుందని ఐఎండీ తెలిపింది. అయితే జూలైలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎల్ నినో వల్ల పసిఫిక్ సముద్ర ఉపరితలం వేడిగా మారుతుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణాల్లో మార్పు సంభవిస్తుంది. ఈ ప్రభావం ఇండియాపై కూడా ఉంటుంది. ఒకవేళ నైరుతి రుతుపవనాల సమయంలో ఎల్‌నినో ఉంటే, అప్పుడు వర్షాలపై ప్రభావం పడే ఛాన్సు ఉంది. ఎల్‌నినో వల్ల సాధారణంగా ఇండియాలో వర్షపాతం తక్కువగా నమోదు అవుతుంది. దీంతో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ శాతం రైతులు వర్షాలపై ఆధారపడడం వల్ల.. ఎల్‌నినో వ్యవసాయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఎల్‌నినో, లానినా.. రెండూ ప్రపంచ వాతావరణ పరిస్ధితులకు సంబంధించినవన్న సంగతి అందరికి తెలుసు. కానీ అవి నిర్దిష్టంగా ఎందుకు ఏర్పడుతాయో అన్నది తెలియదు. నిజానికి శాస్త్రవేత్తలకు కూడా వీటి గురించి పూర్తిగా తెలియదు. 17వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరంలోని మత్స్యకారులు ఈ వాతావరణ పరిస్ధితిని మొదటిసారి కనుగొన్నారని చరిత్ర చెప్తోంది. అప్పటి నుండి వీటిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఎల్‌నినో.. వర్షాభావ పరిస్ధితిని వివరిస్తుంది. లానినా.. విపరీతంగా వర్షాలు కురిసే పరిస్ధితిని వివరిస్తుంది.
సాధారణంగా ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలు మరియు ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించి ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఎల్‌నినో, లానినాలకు కారణమవుతాయి. ఈ రెండింటినీ కలిపి ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’ వలయాలు అంటారు. సముద్రము, దానిపైన ఆవరించి ఉండే వాతావరణాల ఉష్ణోగ్రతలు తీవ్ర స్ధాయిలో ఒడిదుడుకులకు లోనవడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఒక్కో ఏడాది ఒక్కోలా ఉంటుంది. మన దేశానికి లానినా ప్రభావం మంచి సూచన. అదే ఎల్‌నినో ప్రభావం ఉంటే, జూన్ మరియు అక్టోబర్ మధ్య దేశంలో రుతుపవనాలు ప్రభావితమవుతాయని వాతావరణ నిపుణులు అంటుంటారు. కాగా, ఈ ఏడాది భారత్లో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందని, కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ అంచనా వేసింది.
Link for Press Release for Long Range Forecast of 2023 Southwest Season Monsoon Rainfall:- https://t.co/T4UgMQocoX
प्रेस विज्ञप्ति:https://t.co/DBk4PG0PGo https://t.co/0SaQr59bzd— India Meteorological Department (@Indiametdept) April 11, 2023
India Meteorological Department (#IMD) forecasts normal monsoon for the current year. pic.twitter.com/wVjv5csVNS
— All India Radio News (@airnewsalerts) April 11, 2023