‘అవతార్ 2’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. చూసిన వారిలో చాలామంది.. విజువల్స్ కి ఫిదా అయిపోయారు. యాక్షన్ సీన్స్ కేక పుట్టించాయని మాట్లాడుకుంటున్నారు. ‘అవతార్’తో పోలిస్తే సీక్వెల్ కాస్త సాగదీసినట్లు అనిపించిందని కూడా పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ ఎంత? యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు పక్కనబెడితే.. ‘అవతార్’ని హిందూ పురాణాల ఆధారంగా తీశారని […]
‘‘బ్రహ్మాస్త్రం’’ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కిన సినిమాగా ఈ పేరు ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందింది. ఇక, బ్రహ్మాస్త్రం సినిమా మొత్తం అస్త్రాల మీద తెరకెక్కింది. అస్త్రం అంటే ఆయుధం అని అర్థం వస్తుంది. పూర్వపు రోజుల్లో ముఖ్యంగా పురాణాల్లో శత్రువులను చంపటానికి అస్త్రాలను ఉపయోగించేవారు. పురాణాల్లో చాలా రకాల అస్త్రాలు పేరు గాంచాయి. వాటిలో అత్యంత శక్తివంతమైన అస్త్రంగా పేరొందినదే ఈ ‘‘బ్రహ్మాస్త్రం’’. […]
కైలాస పర్వతం.. అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువుండే పవిత్ర స్థలంగా భావిస్తారు. ఎన్నో యుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో ప్రతిధ్వనించే పుణ్యస్థలం ఇది. హిందూ మతమే కాకుండా బౌద్ధ, జైన, బోన్ (ఒక టిబెట్ మతం) మతాలు ఈ పర్వతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాయి. ప్రతి ఏడాది వేలాదిమంది దైవ భక్తులు సందర్శించే కైలాసగిరికి, వేరే పుణ్య క్షేత్రాలకు చాలా తేడా ఉందని చరిత్ర చెబుతుంది. ఆదియోగి నివాసముండే ఈ మహా పర్వతం పై అందరూ […]
డైనోసార్లు లేదా రాక్షసబల్లులు..వీటి పేరు వింటేనే చాలా మందికి గుండెలు అదిరిపోతాయి. ఇక వీటి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది ఈ జాతి అంతం ఎలా జరిగిందన్న విషయాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డైనోసర్లు సుమారు 23 కోట్ల సంవత్సరాల క్రితం ‘ట్రయాసిక్ యుగం’లో ఆవిర్భవించి.. జురాసిక్ యుగం లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది.., ‘క్రెటాషియస్ యుగం’ చివర్లో అంటే.. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం […]