డైనోసార్లు లేదా రాక్షసబల్లులు..వీటి పేరు వింటేనే చాలా మందికి గుండెలు అదిరిపోతాయి. ఇక వీటి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది ఈ జాతి అంతం ఎలా జరిగిందన్న విషయాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డైనోసర్లు సుమారు 23 కోట్ల సంవత్సరాల క్రితం ‘ట్రయాసిక్ యుగం’లో ఆవిర్భవించి.. జురాసిక్ యుగం లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది.., ‘క్రెటాషియస్ యుగం’ చివర్లో అంటే.. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లనేవి ‘డైనోసారియా’ అనే ప్రజాతికి చెందిన జంతువుల సమూహం. వీటిలో వెయ్యి కి పైగా ఉపజాతులున్నాయి. మరి ఈ యుగాలకు చెందిన భారీ జంతువుల ప్రస్తావన హిందూ గ్రంథాలలో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మీరు ఎప్పుడైనా మన దేవతా విగ్రహాల మూల విరాట్టు వెనుక ఉండే లోహ తోరణాన్ని గమనించారా? ఆ లోహ తోరణాన్ని“మకర తోరణం” అంటారు. దాని తల భాగాన్ని ‘సింహ తలాటం’ అంటారు. ఈ తోరణం మీద ‘మకరం’ అనే జంతువు ఆకారం చెక్కబడి వుంటుంది. “మకరం” అంటే సహజంగా మనకు మొసలి గుర్తుకు వస్తుంది. కానీ హిందూ గ్రంథాలలో మకరం గురించి ఉన్న వర్ణన పరిశీలిస్తే అది నిజం కాదని తెలుస్తుంది.
హిందూ గ్రంథాలలో “మకరం” గంగా దేవి వాహనంగా చెప్పబడింది. అంతే కాక వరుణ దేవుడి వాహనంగా కూడా చెప్పబడింది. వరుణుడు మాత్రమే మకరాన్ని నియంత్రించి ఓడించగల సమర్థుడని కూడా చెప్పబడి ఉంది. మొసలినైతే నైపుణ్యం గల సాధారణ వ్యక్తీ కూడా నియంత్రించి ఓడించగలడు. కాబట్టి మకరం అనేది మొసలి కాదని మనం అర్ధం చేసుకోవచ్చు. మహాభారతంలో శ్రీకృష్ణుడి ఓ శ్లోకం ఉంది. పవిత్రీకరించు వాటిలో నేను వాయువును. ఆయుధ ధారులలో రాముడను. మత్స్యములలో మకరమును. ప్రవహించు నదులలో గంగా నదిని అని మహాభారతంలో శ్రీకృష్ణుడు తన గురించి వివరణ ఇచ్చుకుంటాడు. అయితే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సముద్ర జీవుల్లో నేను మకరాన్ని అని చెప్పాడు. అంటే అన్ని రకాల సముద్ర జీవుల్లోను ఉత్తమమైనది మకరం అని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ వర్ణన మొసలికి సరిపోదు. శ్రీకృష్ణుని మాటలను బట్టి మకరం అంటే అంతకు మించిందని అర్ధం అవుతుంది. ఈ వర్ణనలను బట్టి మకరానికి ఇయోసీన్ యుగానికి చెందిన డైనోసార్లతో క్రెటాషియస్ యుగానికి చెందిన రాక్షస బల్లులలు అయిన భారీ సరీసృపాలతో పోలికలు కనబడుతున్నాయి.
ఇక దేవతలు, రాక్షసుల మధ్య జరిగే యుద్ధాలలో ఇరు పక్షాలవారు ఎక్కువగా ప్రమాదకరమైన జంతువులను వాహనాలుగా కలిగి ఉండడం కనబడుతుంది. విభీషణుడు భారీ జంతువులను ఎదుర్కొన్న సంఘటన రామాయణంలో ఉంది. అంతేకాక, లంకా నగరాన్ని భారీ ఆకారాల్లో ఉండే ఎగిరే గుర్రాలు కాపలా కాస్తున్నాయని వాల్మీకి రామాయణంలో ప్రస్తావించబడి ఉంది. సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు సముద్రం పై నుండి ఎగిరి, లంక కు వెళ్తున్నప్పుడు “సింహిక” అనే జల రక్కసి తారసపడుతుంది. ఈ వర్ణనలను బట్టి చూస్తే ఆ నీటి జంతువు డైనోసార్ జాతికి చెందినదిగా అనిపించడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక నాగ్ పూర్ లో ఇటివల పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఒక దిమ్మ తిరిగిపోయే విషయం తెలిసింది. లక్షల సంవత్సరాల క్రితం భారత దేశంలోని కొన్ని డైనోసార్ జాతులు, ఆ కాలంలో పండిన ఒక రకమైన ‘వరి’ని తిని బ్రతికాయట. ఇలా మానవుడు – డైనోసార్ల సహజీవనాన్ని నిరూపించేలా కొన్ని ఆధారాలు లభిస్తున్నా వాటిని బయట పెట్టడానికి శాస్త్రవేత్తలు సాహసించట్లేదు. మొత్తం మీద చూస్తే ట్రయాసిక్, జురాసిక్, క్రెటాషియస్ యుగాలకు చెందినవిగా చెబుతున్నడైనోసార్ల ప్రస్తావన మన హిందూ గ్రంధాలలో స్పష్టంగా చెప్పబడి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.