విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ మీద అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక పోశారు. పుష్పవర్థన్ నెలరోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ మీద వచ్చారు. తనను వేధించారని తన ఉసురు తగులుతుందంటూ అసిస్టెంట్ కమిషనర్ శాంతి శాపనార్థాలు పెట్టారు. ఈ ఘటనపై ఎవరికి వారు వారి వాదనలు వినిపిస్తున్నారు. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ […]
జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.14 క్రీడా విభాగాలకు మొత్తం 102 మంది భారతీయ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ కోసం అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతక విజేతలకు రూ.3కోట్ల బహుమతి ఇవ్వాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టోక్య ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి ఢిల్లీకి చెందిన నలుగురు అథ్లెట్లు ఎంపికయ్యారు. […]
అసలే కరోనా కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ బారినపడితే ప్రాణాలతో బట్టకడతామా? అని భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఇటీవలి కాలంలో చూస్తే 2009లో ఒక్కసారిగా విజృంభించిన స్వైన్ ఫ్లూను మహమ్మారిగా చెప్పవచ్చు. అప్పుడు ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతవరకు గుర్తించని కొత్త వైరస్‌లు, ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకేవి మహమ్మారులుగా మారతాయి. కరోనా వైరస్ ఈ కోవలోకే వస్తోంది. దీన్ని నివారించడానికి ఇంకా వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి […]