ఇంటి పని చేసినందుకు రూ. 1.75 కోట్లు. అంతేనా నెల నెలా ఆమెకు 43 వేలు, ఆమె ఇద్దరు పిల్లలకు 86 వేలు. మొత్తం మీద నెలకు రూ. లక్షా 30 వేలు ఇవ్వాలి. అంత కాస్ట్లీ పని మనిషా అని అనుకుంటున్నారా? నిజమే ఒకటి, రెండు కాదు ఏకంగా 25 ఏళ్ళు పని చేసింది. పెళ్లి చేసుకుని ఒక మనిషికి, ఆ మనిషి ఇంటికి జీతం లేని పని మనిషి అయ్యింది. ఇన్నాళ్లకు ఆమె కష్టాన్ని గుర్తించి ఆమెకు 25 ఏళ్ళు చేసిన చాకిరీకి వేతనం ఇవ్వాలని, నెలకి మెయింటెనెన్స్ కింద లక్షా 30 వేలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
ఢిల్లీలోని ఒక 5 స్టార్ హోటల్ లో తనకు హెయిర్ కటింగ్ సరిగా చేయలేదని, జుట్టు చెప్పినదానికంటే ఎక్కువ కత్తిరించారని ఒక మోడల్ జాతీయ వినియోగదారుల ఫారంకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు జాతీయ వినియోగదారుల ఫారం.. స్టార్ హోటల్ కు రూ. 2 కోట్ల నష్టపరిహారం విధించింది. హోటల్ సెలూన్ లో ఒక మహిళా సిబ్బంది మోడల్ కు తప్పుగా హెయిర్ కట్ చేయడం వల్ల.. సదరు మోడల్ వేదనకు గురైందని, ఆర్థిక నష్టానికి గాను […]
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సిద్ధరామయ్యకు ఘోర అవమానం జరిగింది. కర్ణాటకలోని కెరూర్ హింసాకాండలో గాయపడిన బాధితులకు సిద్ధరామయ్య అందజేసిన పరిహారాన్ని బాధిత కుటుంబాలకు చెందిన ఓ మహిళ విసిరికొట్టింది. అది కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తన సొంత నియోజకవర్గంలోనే చోటుచేసుకోవడం అందరికీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కర్ణాటక కెరూర్ లో పెద్దఎత్తున హింసాకాండ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో నలుగురు […]