కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సిద్ధరామయ్యకు ఘోర అవమానం జరిగింది. కర్ణాటకలోని కెరూర్ హింసాకాండలో గాయపడిన బాధితులకు సిద్ధరామయ్య అందజేసిన పరిహారాన్ని బాధిత కుటుంబాలకు చెందిన ఓ మహిళ విసిరికొట్టింది. అది కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తన సొంత నియోజకవర్గంలోనే చోటుచేసుకోవడం అందరికీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కర్ణాటక కెరూర్ లో పెద్దఎత్తున హింసాకాండ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సిద్ధరామయ్య పరామర్శించిన తర్వాత తన వంతు సహాయంగా నష్టపరిహారం అందించే ప్రయత్నంలో అవమానం చోటు చేసుకుంది. ఒక మహిళ సిద్దరామయ్య ఇచ్చిన పరిహారాన్ని తిరిగి ఆయనపై విసిరివేసింది.
బాగల్కోటేలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలకు రూ.2 లక్షల పరిహారం అందజేశారు. అనంతరం కారులో వెళ్తుండగా.. ఆ మహిళ వాహనం దగ్గర వచ్చి.. డబ్బులు విసిరేసింది. ఆ సమయంలో మహిళ ఎంతో ఉద్వేగానికి లోనైంది. నేతలకు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారు.. ఆ తర్వాత పట్టించుకోరంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో అందర్నీ సమానంగా చూడాలని తెలిపింది. తమకు ఎవరి సానుభూతీ అవసరం లేదని.. హింసకు పాల్పడిన నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేసింది.
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా కేరూర్ పట్టణంలో ఈ మద్య రెండు వర్గాలు అల్లర్లు సృష్టించారు. మార్కెట్‌లో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన క్రమంలో ఒకరిపై మరొకరు గొడవలు పడినట్లు స్థానికులు చెప్పారు. ఈ సందర్భంగా కూరగాలయ మార్కెట్, బైకులు, షాపులకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరికి కత్తిపోట్లు పొడవగా.. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో
ఇది చదవండి: ఘోరం: మామను ప్రైవేట్ పార్టుపై కొట్టి చంపిన కోడలు..
#Karnataka -Compensation money which was given by @siddaramaiah was thrown back at him by the family of victims. #Siddaramaih gave 2lakh rupees for the injured when visited them.
Their demand is not the money but to maintain law and order situation and arrest the culprits. pic.twitter.com/lsLcylbpXf— Siraj Noorani (@sirajnoorani) July 15, 2022