ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. గోవాలో ముందంజలో ఉంది. ఇక పంజాబ్‌లో ఆప్ భారీ విజయం సాధించింది. ఓ ప్రాంతీయ పార్టీ.. రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ కంచుకోటలో ఆప్ జెండా ఎగురవేసింది. ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆప్ తరఫున బరిలో నిలిచిన అతి సామాన్యులు […]
మన దేశంలో రాజకీయాల్లో, సినిమాల్లో రాణించాలంటే.. బలమైన బ్యాగ్రౌండ్ ఉండాలనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. అంతేకాక రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారితో పోలిస్తే సామాన్యులు రాజకీయాల్లో రాణించడం అంత సులభం ఏం కాదు. ఇది అందరికి తెలిసిన సంగతే. మహా అయితే ఎమ్మెల్యేగానే, ఎంపీగానో గెలవవచ్చు. కానీ ఏకంగా ఓ పార్టీ స్థాపించి.. దాన్ని అధికారంలోకి తీసుకువచ్చి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం అంటే పగటికలగానే భావిస్తారు. అయితే ఈ ఆలోచనా ధోరణిని బద్దలు కొట్టారు అరవింద్ కేజ్రీవాల్. […]
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ లో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నిన్న (శుక్రవారం) సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అయితే, ప్రచార సమయం ముగిసినా గానీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంటింటి ప్రచారం చిర్వహించారు. కాగా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీపై కేసు నమోదైంది. చన్నీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబీ గాయకుడు […]