రెండు నెలల క్రితం కేరళ పోలీసులు 300 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. దాని విలువ 3000 కోట్ల రూపాయలు. మాదక ద్రవ్యాలతో పోల్చుకుంటే హెరాయిన్ ధర ఇంత భారీగా ఎందుకు ఉంది? దీనిలో ఏముంది? వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతున్న దశలో మార్ఫిన్, హెరాయిన్‌లను నొప్పి నివారిణులుగా వాడేవారు. శస్త్రచికిత్సలు జరిగిన రోగులకు, తీవ్రమైన గాయాలకు లోనై ఇన్ఫెక్షన్లు, నొప్పులతో బాధపడేవారికి, కేన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేందుకు వీటిని వాడేవారు. బ్రౌన్ షుగర్, హార్స్, జంక్, వైట్ హార్స్ […]
ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు వార్తా పత్రికలు ‘‘వూహాన్ పరిశోధన శాల కుట్ర’’కోణంలో పలు వార్తలు ప్రచురించడంతో మరోసారి చర్చ మొదలైంది. వూహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ముగ్గురు 2019 నవంబర్‌లో కరోనా లక్షణాలతో చికిత్స పొందినట్లు అమెరికా నిఘా నివేదిక చెబుతున్నా ట్రంప్ ఆదేశించిన విచారణను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ నిలిపివేశారన్న ఆరోపణలతో కథనాలు రావడం గమనార్హం. అప్పట్లో కుట్ర కోణాన్ని కొట్టిపారేసిన బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథొనీ ఫాసీ లాంటి వారు […]
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు. చిన్ననాటి నుంచి వివిధ వ్యాధులకు ఆకుపసర్లే వాడామని అవే తమలో రోగనిరోధకశక్తిని పెంచాయని చెబుతున్నారు. ఇప్పటివరకు తమకు మాస్కు వాడే అవసరం కూడా రాలేదని పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లా నల్లమల అభయారణ్యం పరిధిలో చింతల గిరిజనగూడెం గ్రామస్తులు కరోనా చింత లేకుండా జీవిస్తున్నారు. సుమారు […]
ఏపీలో కరోనా విస్తృతిని అడ్డుకట్ట వేయడానికి సర్కార్ సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతిస్తున్న కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల మాదిరి కరోనా కట్టడికి సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం ఒక్క సారిగా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయని కొందరు […]
మధ్య ప్రదేశ్ లో చెట్లు నరికిన ఒక వ్యక్తికి 1.21 కోట్ల జరిమానా విధించారట. ఆ రాష్ట్ర అటవీశాఖ ఈ జరిమానా వేసింది.భమోరీ అటవీ ప్రాంతంలో అనే సిల్వాని గ్రామంలో చోటేలాల్ అనే వ్యక్తి ఐదు స్వాగాస్ చెట్లను నరికాడు. అతగాడు అడవి నరికి కలప విక్రయిస్తున్నాడని గ్రామస్థులు పిర్యాదు చేయగా, అటవీశాఖ అదికారులు పట్టుకున్నారు. అతడు నరికిన చెట్ల విలువను లెక్కించి ఆ ప్రకారం 1.21 కోట్ల జరిమానా విధించారట. ఏబై ఏళ్లు ఈ చెట్లు […]