మధ్య ప్రదేశ్ లో చెట్లు నరికిన ఒక వ్యక్తికి 1.21 కోట్ల జరిమానా విధించారట. ఆ రాష్ట్ర అటవీశాఖ ఈ జరిమానా వేసింది.భమోరీ అటవీ ప్రాంతంలో అనే సిల్వాని గ్రామంలో చోటేలాల్ అనే వ్యక్తి ఐదు స్వాగాస్ చెట్లను నరికాడు. అతగాడు అడవి నరికి కలప విక్రయిస్తున్నాడని గ్రామస్థులు పిర్యాదు చేయగా, అటవీశాఖ అదికారులు పట్టుకున్నారు. అతడు నరికిన చెట్ల విలువను లెక్కించి ఆ ప్రకారం 1.21 కోట్ల జరిమానా విధించారట. ఏబై ఏళ్లు ఈ చెట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఒక్కో సాగ్వన్ చెట్టు తన జీవిత కాలంలో రూ.12 లక్షలు విలువ చేసే అక్సిజన్ అందిస్తుందట. అంతేకాదు ఒక్కో సాగ్వన్ చెట్టు రూ.60 లక్షలు విలువ చేసే ప్రయోజనాలు అందిస్తుందట.
అటవీ శాఖ పరిధిలోని చెట్లను నరికినందుకు మధ్యప్రదేశ్ అటవీ శాఖ ఒక వ్యక్తికి ఏకంగా 1.21 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఎంపీలోని భమోరి అటవీ పరిధిలో ఛోటే లాల్ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరిలో రెండు సాగ్వాన్ చెట్లను అక్రమంగా నరికి కలపను విక్రయించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి నిందితుడిని ఈ నెల 26న అరెస్ట్ చేశారు.
చోటెలాల్ ను అరెస్టు చేయడమే కాకుండా ఇంత భారీగా జరిమానా విధించడం విశేషం. పకృతి ప్రేమికులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి అతను జరిమానా కట్టగలడో లేడో!