సూపర్ మార్టులకి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగులకు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే లోగోతో ఉన్న క్యారీ బ్యాగ్స్ సూపర్ మార్టులు ఉచితంగా ఇస్తాయని. ఉచితంగా ఇవ్వకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చునని తెలుసా? నష్ట పరిహారం కూడా పొందవచ్చు.
ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ప్లాస్టీక్ ని ఏదో ఒక రకంగా వాడుతూనే ఉన్నాం. ప్లాస్టీక్ సంచుల వల్ల పర్యావరణానికి ఎంత ముప్పు ఉందని తెలిసినా కూడా దాని వాడకం మాత్రం తగ్గించలేకపోతున్నాం. ప్రభుత్వం ప్లాస్టీక్ నిషాదాన్ని అమలు చేస్తున్నా.. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్, కూరగాయల మార్కెట్లో ప్లాస్టీక్ సంచులు లేనిదే గడవని పరిస్తితి.
ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్ల వినియోగం మీద నిషేధం విధించిన నాటి నుంచి దుకాణాలు, మాల్స్.. వాటికి చార్జ్ చేస్తున్నాయి. కొన్ని మాల్స్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో పేపర్, జ్యూట్ సంచులు తీసుకువచ్చాయి. అయితే వీటికి సుమారు 20 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇది వినియోగదారులకు భారంగా మారింది. కానీ తప్పడం లేదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి క్యారీబ్యాగ్‌కు డబ్బులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించడమే కాక.. కోర్టుకు వెళ్లాడు. అతడి వాదన విన్న కోర్టు.. షాపింగ్‌మాల్‌కు […]