యాపిల్ స్టోర్లు ఇండియాలో ప్రారంభమైన సమయం నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. నిజానికి టిమ్ కుక్ ఈ స్టోర్లను ప్రారంభించడమే పెద్ద వార్తనుకుంటే.. అంతకు మించిన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాటిలో ఇన్నాళ్లు యాపిల్స్ స్టోర్స్ డిజైన్ గురించి, ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు యాపిల్ స్టోర్స్ లో చేసే ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.
యాపిల్ సంస్థకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని అందరికీ తెలిసిందే. అందుకే టిక్ కుక్ భారత్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. తాజాగా ముంబయిలో యాపిల్ సంస్థ తమ మొదటి స్టోర్ ని ప్రారంభించింది. టిమ్ కుక్ గేట్లు తెరచి యాపిల్ స్టోర్ ని ప్రారంభించారు.