యాపిల్ సంస్థకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని అందరికీ తెలిసిందే. అందుకే టిక్ కుక్ భారత్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. తాజాగా ముంబయిలో యాపిల్ సంస్థ తమ మొదటి స్టోర్ ని ప్రారంభించింది. టిమ్ కుక్ గేట్లు తెరచి యాపిల్ స్టోర్ ని ప్రారంభించారు.
యాపిల్ సంస్థకు చెందిన తొలి స్టోర్ భారత్ లో ఘనంగా ప్రారంభమైంది. ముంబయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ లో తమ తొలి స్టోర్ ని టిమ్ కుక్ అట్టహాసంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సంస్థ స్టోర్లు ఎలాగైతే ఉంటాయో.. ముంబయిలో కూడా అచ్చు అలాంటి స్టోర్ నే రూపొందించారు. 2016లో తొలిసారి టిమ్ కుక్ ఇండియాలో పర్యటించారు. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టిమ్ కుమ్ యాపిల్ స్టోర్ ప్రారంభం కోసం ఇండియా వచ్చారు. 2020లో భారత్ లో ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించిన సంస్థ.. మూడేళ్ల తర్వాత భారత్ లో తమ స్టోర్ ని ప్రారంభించారు.
భారత్ లోనే తొలి యాపిల్ స్టోర్.. ప్రారంభానికి కొన్ని నెలల ముందు నుంచే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. యాపిల్ సంస్థకు భారత్ ఒక అతి ముఖ్యమైన, అతి పెద్ద మార్కెట్ గా అవతరించి చాలా ఏళ్లు అవుతోంది. ఇటీవల అన్ని దేశాల్లో యాపిల్ ప్రొడక్ట్స్ అమ్మకాలు తగ్గితే.. ఒక్క ఇండియాలోనే యాపిల్ సంస్థకు లాభాలు వచ్చాయి. అందుకే టిమ్ కుక్ కు ఇండియా అంటే ప్రత్యేక అభిమానం. భారత్ ని తమ ప్రధాన వాణిజ్య దేశంగా మలుచుకునే పనిలో భాగంగానే యాపిల్ తమ స్టోర్ ని భారత్ లో ప్రారంభించింది. టిమ్ కుక్ స్వయంగా వచ్చి యాపిల్ స్టోర్ ని ప్రారంభిచడమే కాదు.. ముందుగా వచ్చిన కస్టమర్లకు స్వాగతం చెప్పి వారితో సెల్ఫీలు కూడా దిగారు.
#WATCH | Apple CEO Tim Cook opens the gates to India’s first Apple store at Mumbai’s Bandra Kurla Complex pic.twitter.com/MCMzspFrvp
— ANI (@ANI) April 18, 2023
యాపిల్ సంస్థ ముంబయిలోని 20 వేల SFT స్టోర్ కోసం నెలకు రూ.42 లక్షలు అద్దె చెల్లిస్తుంది. ఏడాదికి 15 శాతం అద్దె పెరుగుతుంది. పైగా వచ్చే మూడేళ్లు కంపెనీ తమ లాభాల్లో 2 శాతం ప్రాపర్టీ యజమానికి చెల్లించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్టోర్ లో ఉండే 100 మంది ఉద్యోగులు 18 భాషల్లో మాట్లాడగలరు. యాపిల్ వల్ల భారత్ లో 2500 మంది నేరుగా.. 10 లక్షల మంది యాప్ ఎకో సిస్టమ్ ఆధారంగా ఉపాధి పొందుతున్నట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది. భారత్ లో తమ రెండో స్టోర్ ని ఢిల్లీలో ఏప్రిల్ 20న ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులను ఇండియాలో థార్డ్ పార్టీ సెల్లర్స్ సాయంతో విక్రయించేవాళ్లు. ఇప్పుడు నేరుగా ఈ స్టోర్ల ద్వారా కస్టమర్లకు విక్రయించనున్నారు.
Exclusive First Look.
1st Apple Store in India in Mumbai.
What did they do differently?
What did they Indianise?
What International features did they keep?
Take a look…. pic.twitter.com/UnrmFA4I4h— Rajiv Makhni (@RajivMakhni) April 17, 2023