ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాన నిందితుడికి గ్రామస్తులు షాకిచ్చారు.
మణిపూర్ ఘటన యావత్ భారత దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఆడవారి పట్ల మానవ మృగాళ్లా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్యులు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రెటీలు ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించారు. నింధితులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, హత్యలు మరీ ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది హత్య చేసి ఆనవాలు లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. కానీ ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు చేయడంతో పోలీసులకు పట్టుబడతారు.