ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాన నిందితుడికి గ్రామస్తులు షాకిచ్చారు.
మణిపూర్ లో ఇద్దరు మహిళలను అపహరించి, వివస్త్రలను చేసి ఆపై వారి మీద సామూహిక అత్యాచారం జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హుయిరేమ్ హెరోదాస్ సింగ్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో ఆధారంగా ప్రధాన నిందితుడ్ని గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మహిళను వివస్త్రను చేసి ఆరు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ప్రధాన నిందితుడు హుయిరేమ్. అయితే వీడియో వైరల్ అవ్వడంతో నిందితుడు భయంతో కుటుంబాన్ని వేరే చోటుకి తరలించి.. మరో చోట తలదాచుకున్నాడు. బుధవారం రాత్రి జల్లెడ పట్టి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇంకా ఈ రాక్షస క్రీడలో వీరితో పాటు ఉన్న మిగిలిన నిందితులను కూడా పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదిలా ఉంటే ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఆ ఘటనపై ప్రజాగ్రహ జ్వాలలు ఆరడం లేదు. దీంతో ప్రధాన నిందితుడు అరెస్ట్ అయినప్పటికీ ప్రజలు శాంతించడం లేదు. దీంతో పేచీ అవాంగ్ లైకైలో ఉన్న ప్రధాన నిందితుడి ఇంటిని గ్రామస్తులు చుట్టుముట్టి టైర్లతో తగలబెట్టేశారు. ఆపై కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు నినాదాలు చేశారు. మళ్ళీ ఆ ఊరు వచ్చి ఆ ఇంటిలో ఉండడానికి ప్రధాన నిందితుడి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారని ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంటిని తగులబెట్టారు. తగులబెట్టిన వారిలో అధికంగా మహిళలే ఉండడం గమనార్హం. నిరసన తెలుపుతూ కొంతమంది స్థానికులు నిందితుడి ఇంటికి నిప్పు అంటించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. మళ్ళీ అల్లర్లు రేగే అవకాశం ఉండడంతో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.
The house of Huirem Herodas Meitei, the main accused in the sexual assault case was burnt down by an agitated mob comprising mostly women#manipur #manipurvideo #manipurburning #manipurviolence #India #news pic.twitter.com/J1ZQ6qYHXl
— News18 (@CNNnews18) July 21, 2023