మణిపూర్ ఘటన యావత్ భారత దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఆడవారి పట్ల మానవ మృగాళ్లా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్యులు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రెటీలు ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించారు. నింధితులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
దేశంలో మహిళలపై రోజు రోజుకీ అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుకీ తెగకు చెందిన ఓ యువతిపై గ్యాంగ్ రేప్ కి పాల్పపడి, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనలో ప్రధాన నింధితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
దేశం తలదించుకునేటా మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారం, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.ఈ రోజు పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. నింధితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. తాజాగా ఈ అకృత్యానికి ప్రధాన నిందితుడైన హురేం హెరోదాస్ మైతేయి(32) ని పోలీసులు అరెస్ట్ చేశారు. వైరల్ అయిన వీడియోలో ఈ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది చదవండి: మణిపూర్ అల్లర్లకు కారణం ఏంటి? దేని కోసం మారణహోమం!
మణిపూర్ ఘటనను పోలీసులు సుమోటుగా తీసుకొని రంగంలోకి దూకారు. తౌబల్ జిల్లాలో ప్రధాన నిందితుడైన హురెం హెరోదాస్ ని అరెస్ట్ చేశారు. ఇతడు మైతేయి పెంచి అవాంగ్ లెకాయ్ లో నివసిస్తున్నాడు. బాధిత మహిళల్లో ఒకరికి 20 ఏళ్లు, మరొక మహిళకు 40 ఏళ్ల వయసని జాతీయ వార్తా పత్రికలు పేర్కొంటున్నాయి. ఓ యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై సీఎం ఎన్ బీరెన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరు బాధిత మహిళలకు సానుభూతి ప్రకటించారు. అంతేకాదు ఇది యావత్ భారత దేశం సిగ్గుతో తలదించుకునే సమయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాష్టికానికి పాల్పపడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఖచ్చితంగా ఉరిశిక్ష పడేలా చూస్తామని తెలిపారు.
Manipur | The main culprit who was wearing a green t-shirt and seen holding the woman was arrested today morning in an operation after proper identification. His name is Huirem Herodas Meitei (32 years) of Pechi Awang Leikai: Govt Sources
(Pic 1: Screengrab from viral video, Pic… pic.twitter.com/e5NJeg0Y2I
— ANI (@ANI) July 20, 2023