పోలీసు అమ‌ర‌వీరుల త్యాగాలు మరువం: సీపీ మహేశ్ భగత్

అంబ‌ర్‌పేట్ కార్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి శ్రద్దాంజలి ఘటించారు. ఇక పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినం సంద‌ర్భంగా అమ‌రుడైన హోంగార్డు లింగ‌య్య త‌ల్లి సార‌మ్మ‌కు రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ పాదాభివంద‌నం చేశారు.

amaraveera min2015లో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఆత్మ‌కూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో సిమీ ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో అక్కడే విధి నిర్వహనలో ఉన్న ఎస్ ఐ సిద్దయ్య తన ప్రాణాలకు తెగించిన ఉగ్రవాదులతో పోరాడారు. ఈ క్రమంలోనే ఆయనకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ పోరాటంలో ఎస్ఐ సిద్దయ్య, కానిస్టేబుల్స్ స‌హా హోంగార్డు లింగ‌య్య ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.

అమ‌ర‌వీరులకు నివాళి ఘటించిన తర్వాత ఈ సందర్భంగా మ‌హేశ్ భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్‌ అమరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. తమ ప్రాణాలు లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి అసువులు బాసిన పోలీసు అమ‌రవీరుల త్యాగం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ పేర్కొన్నారు.