రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 3488 మంది అరెస్ట్‌

Police Special Drive

స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి తప్పించుకుని తిరుగుతున్న 3488 నిందితులను ఒడిశా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్స్‌ ఉన్న నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలా పెండింగ్‌లో ఉన్న కేసులను ఒక కొలిక్కితీసుకొచ్చేందుకు పోలీసుల పక్కాప్రణాళిక రూపొందించారు. ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టి దాదాపు 3488 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇలా తక్కువ సమయంలో ఇంతమందిని అరెస్ట్‌ బహుశా ఇదే ప్రథమం కావచ్చు. ఇలాంటి స్పెషల్‌ డ్రైవ్‌లతో నిందితులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. అన్ని రహదారులపై చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన దొరికినవారిని దొరికినట్టే అదుపులోకి తీసుకున్నారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో వేల సంఖ్యలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం.