ఒడిషాలోని బరగఢ్ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తితో కలిసి పపడాహండిలో రహస్యంగా సహజీవనం సాగిస్తోంది. అది తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు స్థానిక ఏఎస్పీ జయకృష్ణ బెహరాను సంప్రదించి తమ కూతుర్ని తమకు అప్పజెప్పాలని అడిగారు. దానికి ఆ ఏఎస్పీ.. యువతి ఉన్న చోటుకి వెళ్లి బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించాడు. అయితే యువతి అందుకు నిరాకరించింది. ఆమె రానని ఆర్తనాదాలు చేయడంతో సమీపంలో ఉన్న జర్నలిస్టులు వెళ్లి వీడియో తీయడం ప్రారంభించారు. అది గమనించిన ఏఎస్పీ ఆగ్రహంతో ఊగిపోతూ లాఠీలతో జర్నలిస్టులపై దాడి చేశాడు. అడ్డుకున్న మహిళలను సైతం కొట్టాడు. సార్ కొట్టకండి అని చెప్పిన తోటి పోలీసులను కూడా బూతులు తిడుతూ రెచ్చిపోయాడు.
@GovernorOdisha @CMO_Odisha @DGPOdisha @odisha_police @MoSarkar5T @CIDOdisha @homeodisha @SecyChief @SpNabarangpur @DMnabarangpur @ministryofhome1
I strongly urge to throw out the Addl.SP Nabarangpur Cum Khaki Clad Goon Jaikrushna Behera immediatly for his heinous & hatred action pic.twitter.com/siDk3s7PXP— Bhajaman Biswal National Human Rights Defender (@Bhajaman_Biswal) September 15, 2022
ఏఎస్పీని ఆపేందుకు వెళ్లిన మహిళలకు.. అతని దగ్గర మద్యం వాసన రావడంతో దూరం జరిగారు. అయితే అందరి మీద విరుచుకుపడుతూ ఏఎస్పీ ఆ యువతిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భాస్కర్ రైతా ఘటనా స్థలానికి చేరుకొని జర్నలిస్టులతో చర్చించారు. ఏఎస్పీ జయకృష్ణ బెహరా వీరంగం సృష్టించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళలు అని కూడా చూడకుండా వారి పట్ల మిస్ బిహేవ్ చేస్తూ.. వారి శరీర భాగాలను తాకుతున్న వైనాన్ని మానవ హక్కుల సంఘ వారు తప్పుబట్టారు. ఏఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
మహిళను అగౌరవపరిచిన అధికారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అయితే అనారోగ్యం కారణంగా ఏఎస్పీ జయకృష్ణ గురువారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరడం విస్మయానికి గురి చేస్తుంది. దాడి చేసిన వ్యక్తికీ దెబ్బలేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా బాధిత యువతిని పోలీసులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇక ఏఎస్పీ జయకృష్ణ బెహరాను.. కొరాపుట్ జిల్లా ఎస్పీ వరుణ్ గుంటువల్లి దర్యాప్తుకు ఆహ్వానించగా.. స్పెషల్ ఆఫీసర్ గా ఏఎస్పీ బ్రహ్మ దర్యాప్తు ప్రారంభించారు. మరి యువతిని అగౌరవపరిచే విధంగా ప్రవర్తించిన ఏఎస్పీపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
#ସାମ୍ବାଦିକଙ୍କୁ_ମାଡମାରିଲେ_ଅତିରିକ୍ତ_ଏସପି
ନବରଙ୍ଗପୁର ଜିଲ୍ଲା ପାପଡାହାଣ୍ଡି ଥାନାରେ ଖବର ସଂଗ୍ରହ ପାଇଁ ଯାଇଥିବା ବେଳେ ସାମ୍ବାଦିକଙ୍କୁ ମାଡମରାଯାଇଛି । ଅତିରିକ୍ତ ଏସପି ସାମ୍ବାଦିକଙ୍କ ଉପରେ ଆକ୍ରମଣ କରିଥିଲେ । #Nabarangpur #Police #Attack #KanakNews pic.twitter.com/g769QBnkOJ— Kanak News (@kanak_news) September 15, 2022