గాల్వాన్ లో వీరమరణం పొందిన సంతోష్ బాబుకి మహావీర చక్ర అవార్డు

గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కల్నల్ సంతోష్ బాబుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం.

assg minనేడు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సంతోష్ బాబు భార్య  ఆయన తల్లి ఈ అవార్డు అందుకున్నారు. లఢఖ్ ఈశాన్య ప్రాంతంలో భారత భూభాగంపైకి అక్రమంగా చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ బలగాలను నిరోధించే సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. 20 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్న కల్నల్ సంతోష్ బాబు సారథ్యంలో జవాన్లు చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని అడ్డుకోగలిగారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. వారిని వెనక్కి తరిమి కొట్టగలిగారు.

fadgasg min

చైనా బలగాలను తరిమికొట్టడంలో, వారి దురాక్రమణను నిరోధించడంలో కల్నల్ సంతోష్ బాబు వీరోచితంగా పోరాడారని, చివరికి ప్రాణాలను సైతం వదలడం అందరి హృదయాలను కలచి వేసింది. అప్పట్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఆయనకు మహావీర్ చక్ర అందజేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కాగా, సంతోశ్ బాబు మరణించిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకున్న సంగతి తెలిసిందే.