బీహార్ (నేషనల్ డెస్క్)- ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసుల పెరుగుదలకు అనుగునంగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కరోనా రోగుల దగ్గరకి వెళ్లాలంటేనే వణికిపోతున్న ఈ సమయంలో ఇక కరోనాతో చనిపోయిన మృతదేహాం దగ్గరకు ఎవరు వెళ్తారు చెప్పండి. అందుకే చాలా ప్రాంతాల్లో కరోనాతో చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయాలంటే అంతా ఆలోచిస్తున్నారు. దీంతో చాలా మంది కరోనాతో మరణించిన వారి మృత దేహాలను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. దీంతో కొన్ని చోట్ల ఆస్పత్రి సిబ్బంది మునిసిపాలిటీ సిబ్బంది సాయంతో శవాలను దహనం చేస్తోంటే.. మరి కొన్ని చోట్ల ఇంకా మార్చూరిలోనే కరోనా మృతదేహాలను అట్టిపెడుతున్నారు. ఇదిగో ఇలాంటి సమయంలో గంగా నదిలో శవాలు తేలడం కలకలం రేపుతోంది.
బీహార్ లోని బక్సర్ జిల్లాలోని మహదేవ్ ఘాట్ వద్ద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 శవాలు నీటిపై తేలుతూ కనిపించాయి. వీటిని చూసిన సమీప గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా 100 శవాలను చూసే సరికి వాళ్లంతా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ శవాలు బీహార్ కు చెందినవి కాదని, ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చాయని తేలిందని బక్సర్ జిల్లా అధికారులు తెలిపారు. తమ ప్రాంతంలో ఎవరైనా కరోనాతో మరణిస్తే వెంటనే దహనం చేస్తున్నామని చెప్పారు. అక్కడ కరోనాతో ఎవరు చనిపోయినా కాపలాదారులను పెట్టి మరీ దహన ప్రక్రియను పూర్తి చేస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. గంగానదిలో అప్పుడప్పుడు ఇలా శవాలు కొట్టుకు రావడం సహజమేనని స్థానికులు చెబుతున్నారు. ఐతే ఒకటి రెండు శవాలు కొట్టుకురావడమే కాని, ఇలా వంద శవాలు కొట్టుకురావడం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. గంగా పరివాహన ప్రాంతాల్లో సాధారనంగా ఎవరైనా చనిపోతే దహనం చేస్తుంటారు.
ఉత్తరాదిలో పలు జిల్లాల్లో కరోనా కేసులను, మరణాలను లెక్కల్లో తక్కువ చూపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే కరోనాతో చినిపోయిన వారి శవాలను అధికారికంగా దహనం చేయకుండా.. ఇలా గంగా నదిలో విసిరేస్తున్నారని అంటున్నారు. ఐతే ఇలా గంగానదిలో కొట్టుకు వచ్చే శవాలు ఎక్కడో ఒక చోటు దేనికైనా తట్టుకుని ఆగిపోతాయి. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్లు మృతదేహాలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కో సారి శవాలను కుక్కలు, ఇతర జంతువులు పీక్కతిని సగం అలాగే వదిలేస్తాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని స్థానిక గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు గంగా నదిలో ఇలా కొట్టుకువచ్చే శవాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ప్రభుత్వమే దహనం చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దహనం చేయలేని వారు ఒక్కసోరా గంగానదిలో శవాలను పారేస్తుంటారని స్థానికంగా ఉండే పండిత్ చెప్పారు. ఇక ఇప్పుడు పరిస్థితి మరింత దయానీయంగా ఉంది. ఒక శవానికి సహన సంస్కారాలు చేయాలంటే 10 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడుతున్న పరిస్థితుల్లో నిరుపేదలు అంత ఖర్చు పెట్టలేకపోతున్నారు. అందుకే కరోనాతో మరణించిన వారి శవాలను ఇలా గంగానదిలో విసిరేస్తున్నారని చెబుతున్నారు. గంగా పరివాహన ప్రాంతంలో దహన సంస్కారాలకు మృద దేహాాలను పడవల్లో తీసుకెల్లి ఆవలి ఒడ్డున దహనం చేస్తారు. కానీ ఇప్పుడు కరోనా నేపధ్యంలో పడవలు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో కరోనాతో చనిపోయిన వారి మృత దేహాలను ఇలా గంగానదిలో పారేస్తున్నాారని స్థానికులు అంటున్నారు. ఇక ఇలా గంగానదిలో శవాలు కొట్టుకు రావడానికి మరో వాదన కూడా విన్పిస్తోంది.