మీ సపోర్ట్ కావాలంటున్న ఫన్ బకెట్ భార్గవ్, బెయిల్ పై వచ్చాడా?

స్పెషల్ డెస్క్- ఫన్ బకెట్ భార్గవ్ గుర్తున్నాడు కదా. టిక్ టాక్ స్టార్ గా బాగా పాపులర్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ మొన్నా మధ్య కటకటాలపాలయ్యాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఫన్ బకెట్ భార్గవ్, 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కామాంధుడిపై దిశ కేసు నమోదు చేసి ఫన్ బకెట్ భార్గవ్‌ని అరెస్ట్ చేశారు. టిక్ టాక్‌లో నాలుగు వీడియోలు పెట్టడం, ఫాలోవర్స్‌ని పెంచుకోవడం, ఆ తరువాత హీరోల్లా బిల్డప్ కొట్టడం, అమ్మాయిలకు వల వేయడం, ఈ మధ్య కాలంలో టిక్ టాక్, యూట్యూబ్ స్టార్లుగా చెప్పుకునే బిల్డప్ గాళ్లు బాగా ఎక్కువైపోయారు.

WhatsApp Image 2021 07 20 at 08.

ఇదిగో ఈ క్రమంలోనే ఫన్ బకెట్ భార్గవ్ టిక్ టాక్ లో, ఆ తరువాత యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఇటువంటి సమయంలో అవకాశాల కోసం తనను సంప్రదించిన అమ్మాయలను భార్గవ్ ట్రాప్ చేసేవాడు. ఇలాగే ఓ 14 ఏళ్ల అమ్మాయిని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఫలితంగా ఆ మైనర్ బాలిక గర్బవతి అయ్యింది. విషయం బయటకు రావడంతో ఏప్రీల్ 18న ఫన్ బకెట్ భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి ఫన్ బకెట్ భార్గవ్ జైల్లోనే ఉన్నాడు.

ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు నేను మళ్లీ వచ్చేస్తున్నాను అని చెబుతున్నాడు ఫన్ బకెట్ భార్గవ్. అంతే కాదు మీ సపోర్ట్ కావాలని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. మీరు విన్నది నిజయం అయితే, నిజం గెలవలేకపోయినా, నేను నిజంగా తప్పు చేస్తే, ఆ అబద్దం, నిజం అయితే, ఆ నిమషమే నాచేతిలో నా మరణం, నేను తప్పు చేస్తే ఆ నిమషమే నా చేతిలో నేను చావటానికి సిద్దం.. అంటూ తన పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. ఫన్ బకెట్ భార్గవ్ బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు వచ్చి ఏంచేస్తాడన్నదే ఆసక్తికరంగా మారింది.