మృతదేహం అని వెళ్తే.. పోలీసులకు, గ్రామస్థులకు షాక్ ఇచ్చిన తాగుబోతు..!

సాధారణంగా మనిషికి కాస్త మందు పడితే అతనిలోని అపరిచితుడు బయటకు వస్తాడు.. తానేం చేస్తున్నాడో తెలియని పరిస్థితి చేరుకుంటాడు. ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది తాగుబోతులు చేస్తున్న వీరంగాలు.. కామెడీలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామంలో ఓ తాగుబోతు చేసిన పనికి పోలీసులు.. గ్రామస్థులకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది.

dead minచుట్టూ చెట్ల పొద.. అక్కడ నీటీలో ఓ శవం కనిపించింది.. అంతే స్థానికులు ఒక్కసారే షాక్ గురైయ్యారు.. వెంటనే ఆ మృతదేహాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు శవాన్ని వెలికితీసేందుకు రంగంలోకి దిగారు. తీరా మృతదేహం వద్దకు చేరుకోగానే పోలీసులు.. స్థానికులు ఒక్కసారే అవాక్కయ్యారు. ఇంతకీ వారంతా ఎందుకు అవాక్కయ్యారు అనుకుంటున్నారా? అసలు విషయానికి వస్తే.. ప్రకాశం జిల్లా సంతమాగులూరు సాగు నీటి కాలువ వద్ద మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృత దేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించగా.. చనిపోయాడు అనుకున్న ఆ వ్యక్తి ఒక్కసారే లేచి నిల్చున్నాడు. దాంతో అక్కడ పోలీసులతో సహ స్థానికులు షాక్ కి గురయ్యారు.

gasee minవెలిగండ్ల గ్రామానికి చెందిన నాగేశ్వరరావు తన చెల్లెల్ని చూడటానికి సంతమాగులూరు వచ్చి బాగా తాగిన మైకంలో అక్కడకు వచ్చి పొదల మద్య నీటిలో పడిపోయాడు. అతన్ని శవం అనుకుని గ్రామస్థులు, పోలీసులు రావడం.. నాగేశ్వరరావు లేచి నిల్చోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే పోలీసులకు నాగేశ్వరరావు అసలు విషయం చెప్పడంతో మందలించి విడిచి పెట్టారు.