మొన్న కోటి రూపాయల వాచ్.. ఇప్పడు 2.5 కోట్లా.. చరణ్ రేంజే వేరప్ప

ramcharan car watch

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏది చేసినా ప్రత్యేకమే. ఆయన అభిరుచులు మరీ ప్రత్యేకం. లగ్జరీ వాచ్ లు, కార్లపై చరణ్ ను మక్కువ ఎక్కువ. మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చింది అనగానే కొనేవారు కొంతమంది. రామ్ చరణ్ అలా కాదు, సంథిక్ డిఫెరెంట్ ఉంటేనే, అది ఆయనకు ఎంతో నచ్చితేనే కొంటారు. అందులో భాగమే మొన్న నూతన సినిమా ప్రారంభోత్సవ సందర్భంగా పెట్టుకున్న వాచ్, అంతకు ముందున్న ఫెరారీ కారు, ఇప్పుడు లేటెస్ట్ గా కొన్న మెర్సిడిస్ బెంజ్ కారు. ఈ కొత్త మోడల్ కారును చరణ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఆదివారం రామ్ చరణ్ కు కార్ డెలవరీ అయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాని గురించి మీరూ తెలుసుకోండి..

ఈ కారు పేరు మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్‌ 600. ఆదివారం చరణ్‌ దాన్ని హ్యండోవర్‌ చేసుకున్నారు. అనంతరం తన టీంతో కలిసి గ్రాండ్‌గా ఓపెన్‌ చేసి తన కొత్త బ్లాక్‌ కలర్‌ బెంజ్‌ కారులోనే చరణ్‌ ఇంటికి బయలుదేరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ట్రక్‌ నుంచి దింపుతూ మొదలైన ఈ కారు వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ కారు ధర రూ. 2.5 కోట్లు ఉంటుందట. అయితే చెర్రీ దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్న సంగతి తెలిసిందే.