అభిమానులకు నిధి అగర్వాల్‌ ఆఫర్‌.. 12 రహస్యాలు చెబుతానంటూ.. మొదటిది ఏంటంటే!

‘సవ్యసాచి’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్‌ ఇస్మార్ట్‌ బ్యూటీగా కొనసాగుతోంది. ఎప్పుడూ ఇన్‌స్టాలో అప్‌డేట్స్‌ ఇస్తూ అభిమానులకు బాగా దగ్గరగా ఉండే నిధి.. కొద్ది రోజులుగా అప్‌డేట్స్‌ ఏమీ ఇవ్వడంలేదు. అభిమానులతో ఇంటారెక్ట్‌ అవ్వడం లేదు. మళ్లీ వారితో ర్యాపో కొనసాగించేందుకు ప్లాన్‌ చేసింది నిధి. అందుకు ఒక సర్వే కూడా నిర్వహించేసింది. తన ఇన్‌స్టా స్టోరీలో అభిమానులను ఓ ప్రశ్న అడిగింది. తాను ఇన్‌స్టాలో మరింత యాక్టివ్‌ కావాలని ఎంత మంది కోరుకుంటున్నారు అని. అందుకు దాదాపు అందరూ యాక్టివ్‌ కావాలనే కోరుకుంటున్నట్లు సమాధానమిచ్చారు.

nidhi agarwalఅభిమానులతో ఇంటరాక్ట్‌ అయ్యేందుకు నిధి అగర్వాల్‌ ఓ కొత్త దారి ఎంచుకుంది. నా గురించి మీకు మరిన్ని రహస్యాలు చెబుతానంది. ‘నా 12 మిలియన్‌ ఫాలోవర్ల కోసం నాకు సంబంధించిన 12 రహస్యాలను 12 రోజులపాటు రోజూ మధ్యాహ్నం 12 గంటలకు చెబుతానంటూ అభిమానులకు ఆఫర్‌ ఇచ్చేసింది. అన్నదే తడవుగా తన మొదటి రహస్యాన్ని రివీల్‌ చేసింది ఈ బ్యూటి. తన చేతిని, గోర్లను చూసిన ప్రతి ఒక్కరూ వాటిని అలా ఎలా మైన్‌టైన్‌ చేస్తున్నావు. వాటికోసం ఏం చేస్తావు అని అడుగుతారట. అందుకు ఏమైనా ప్రత్యేక మేకోవర్‌ చేస్తావా అని తెలుసుకోవాలని చూస్తారంట. అందుకు సంబంధించి నిధి అసలు విషయంచెప్పేసింది. ‘అవి సహజంగానే అలా ఉంటాయి. అవి అలా ఉండటమే నాకు ఇష్టం. వాటికోసం నేను ప్రత్యేకంగా ఏమీ చేయను’ అని నిధి సమాధాన మిచ్చింది. ఒక రహస్యమైతే అయిపోయింది మరి రోజూ ఏం రహస్యాలు బయటపెడుతుందో చూడాలి.