జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే విద్యే ప్రధానమైన మార్గం. ఉన్నత విద్యనభ్యసించి తాము కోరుకున్నరంగంలో రాణించవచ్చు. ఉన్నత విద్య కోసం పలు రకాల అర్హత పరీక్షలు రాస్తుంటారు విద్యార్థులు. దీనిలో భాగంగా పాలీసెట్ పరీక్షలు రాసి ఫలితాలకోసం ఎదురుచూసే విద్యార్థులకు సాంకేతిక విద్యాశాఖ గుడ్ న్యూస్ తెలిపింది.

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లో సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదలచేశారు. పాలీసెట్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు. సూర్యపేటకు చెందిన సురభి శరణ్య 119 మార్కులతో టాస్ ర్యాంక్ సాధించింది. రెండో ర్యాంకు కూడా అదే జిల్లాకు చెందిన అబ్బాయి షేక్ అబ్బు కైవసం చేసుకున్నాడు.
పాలీసెట్ పరీక్ష ఫలితాల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 17న పాలీసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1,05,656 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 58,468 మంది అబ్బాయిలు, 47,188 మంది అమ్మాయిలు ఉన్నారు. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పివి నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్థులు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.